BIG BREAKING: భారత్ పై మరో ఉగ్రదాడికి కుట్ర!
పహల్గామ్ దాడి సరిపోలేదన్నట్టు ఇప్పుడు టీఆర్ఎఫ్ మరో కుట్రకు ప్లాన్ వేస్తోంది. పాక్ ఆర్మీ ఛీఫ్ అసిమ్ మునీర్ సూచనలతోనే ఈసారి కూడా దాడి చేయడానికి ఉగ్రవాదులు రెడీ అవుతున్నారని సమాచారం.
పహల్గామ్ దాడి సరిపోలేదన్నట్టు ఇప్పుడు టీఆర్ఎఫ్ మరో కుట్రకు ప్లాన్ వేస్తోంది. పాక్ ఆర్మీ ఛీఫ్ అసిమ్ మునీర్ సూచనలతోనే ఈసారి కూడా దాడి చేయడానికి ఉగ్రవాదులు రెడీ అవుతున్నారని సమాచారం.
పహల్గామ్ లో దాడి చేసిన ఉగ్రవాదుల గురించి ఎన్ఐఏ తీవ్ర దర్యాప్తు చేస్తోంది. ఇందులో అనేక ముఖ్య విషయాలను కనుగొంది. దాడికి ముందు ఉగ్రవాదులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారని..రెసిస్టెన్స్ టైమ్ అనే ఒక గ్రూప్ తో కనెక్ట్ అయ్యారని చెబుతోంది.
పహల్గామ్ దాడికి తమకు ఏం సంబంధం లేదని పాకిస్తాన్ బుకాయిస్తోంది. కానీ అది చేయించింది పాక్ సైన్యమే అన్న ఫ్రూఫ్ ను భారత దర్యాప్తు బృందాలు కనుగొన్నాయి. ఉగ్రవాదుల్లో ఒకడైన హషిమ్ మూసా పాక్ సైన్యంలో ప్రత్యేక దళమైన పారా కమాండో అని తేలింది.
పహల్గాం దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు గత ఐదు రోజుల్లో నాలుగు సార్లు గుర్తించారు. అడవులలో ఒక మూలన ఉండటంతో వారిపై కాల్పులు కూడా జరిపారు. ఉగ్రవాదులు దగ్గరలోనే ఉన్నారని త్వరలోనే పట్టుకోనున్నట్లు ఓ సైనికాధికారి వెల్లడించారు.
ఉగ్రవాదులను వెతికి పట్టుకోవడానికి బారత బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు మరో ఉగ్రవాది ఇల్లును పేల్చేశారు. ఫరూఖ్ అహ్మద్ తెడ్వా అనే ఎల్ఈటీ ఇంటిని కాల్చేశారు.
పహల్గామ్ ఘటన మరువకముందే టెర్రరిస్టులు మరో దాడికి పాల్పడ్డారు. జమ్మూ కశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో45 ఏళ్ల సోషల్ యాక్టివిస్ట్ రసూల్ మాగ్రేపై ఆయన ఇంట్లోనే కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలతో రసూల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
జమ్మూ కాశ్మీర్ అంతటా చురుకుగా పనిచేస్తున్నట్లు భావిస్తున్న 14 మంది స్థానిక ఉగ్రవాదుల జాబితాలను ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సిద్ధం చేశాయి. ప్రతి ఒక్క ఉగ్రవాది గురించి సమాచారాన్ని సేకరించింది. వీళ్లంతా జమ్మూ కాశ్మీర్లో ఉంటూనే ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.