/rtv/media/media_files/2025/04/26/oCh1cUgYDL2L5YLonjBr.jpg)
14 local terrorists
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత టెర్రరిస్టులను అంతమొందించడానికి ఇండియన్ ఆర్మీ ఏకకాలంలో అనేక కార్యకలాపాలను ప్రారంభించింది. ఇప్పటివరకు 7 మంది ఉగ్రవాదుల ఇళ్లను సైన్యం ధ్వంసం చేసింది. అంతేకాకుండా భారత సైన్యం చేతిలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూ కాశ్మీర్ అంతటా చురుకుగా పనిచేస్తున్నట్లు భావిస్తున్న 14 మంది స్థానిక ఉగ్రవాదుల జాబితాలను ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సిద్ధం చేశాయి. ప్రతి ఒక్క ఉగ్రవాది గురించి సమాచారాన్ని సేకరించింది. వీళ్లంతా జమ్మూ కాశ్మీర్‌లో ఉంటూనే ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించింది.
The ENEMY WITHIN. STILL ON THE LOOSE. HERE'S THE LIST OF 14 "local" Islamist terrorists wanted by the security forces.
— Rahul Shivshankar (@RShivshankar) April 26, 2025
District wise:
Awantipora: 1
Sopore: 1
Pulwama: 4
Shopian: 5
Anantnag: 2
Kulgam: 1 pic.twitter.com/X1SX1D6uLk
20 నుంచి 40 ఏళ్ల వయసు మధ్యున్న వీరంతా హిజ్బుల్ ముజాహిదీన్ , లష్కరే తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్ గ్రూపులకు చెందినవారని నిఘా సంస్థలు పేర్కొన్నాయి. ఈ లిస్టులో అవంతిపోరాలో ఒక జైష్ ఉగ్రవాది చురుకుగా ఉన్నట్లు , లష్కరే, జైష్‌లకు చెందిన ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు పుల్వామాలో చురుకుగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. సోఫియాన్‌లో ఒక హిజ్బుల్, నలుగురు లష్కర్లు, అనంత్‌నాగ్‌లో ఇద్దరు స్థానిక హిజ్బుల్ ఉగ్రవాదులు, కుల్గాంలో ఒక స్థానిక లష్కర్ ఉగ్రవాది చురుకుగా ఉన్నట్లుగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు వెల్లడించాయి.
ఉగ్రవాదుల పేర్లు:
ఆదిల్ రెహమాన్ డెంటూ (21), ఆసిఫ్ అహ్మద్ షేక్ (28), అహ్సాన్ అహ్మద్ షేక్ (23), హారిస్ నజీర్ (20), ఆమిర్ నజీర్ W(20), యావర్ అహ్మద్ భట్, ఆసిఫ్ అహ్మద్ ఖండే (24), నసీర్ అహ్మద్ వాని (21), షాహిద్ అహ్మద్ కుటాయ్ (27), ఆమిర్ అహ్మద్ దార్, అద్నాన్ సఫీ దార్, జుబైర్ అహ్మద్ వాని (39), హరూన్ రషీద్ గనై (32), జాకీర్ అహ్మద్ గనీ (29).