Pahalgam Attack: పహల్గామ్ దాడి ఖచ్చితంగా పాక్ సైన్యం పనే.. ఇదిగో ప్రూఫ్స్!

పహల్గామ్ దాడికి తమకు ఏం సంబంధం లేదని పాకిస్తాన్ బుకాయిస్తోంది. కానీ అది చేయించింది పాక్ సైన్యమే అన్న ఫ్రూఫ్ ను భారత దర్యాప్తు బృందాలు కనుగొన్నాయి. ఉగ్రవాదుల్లో ఒకడైన హషిమ్ మూసా పాక్‌ సైన్యంలో ప్రత్యేక దళమైన పారా కమాండో అని తేలింది. 

author-image
By Manogna alamuru
New Update
terrorist

Hashim Musa, Terrorist

పహల్గామ్ దాడి వెనుక కచ్చితంగా పాకిస్తాన్ సైన్యం హస్తం ఉంది అంటున్నాయి భారత దర్యాప్తు బృందాలు. పహల్గాం దాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదుల్లో ఒకడైన హషిమ్‌ మూసా పాక్‌ సైన్యంలో ప్రత్యేక దళమైన పారా కమాండో అని తమ దర్యాప్తులో తేలింది అంటూ ప్రూవ్స్ చూపిస్తున్నారు. అయితే అతను ప్రస్తుతం ఉగ్రవాదిగా మారిపోయాడని...పాక్ కు చెందిన లష్కరే తోయిబాతో కలిపి పని చేస్తున్నాడని చెప్పారు. టీఆర్ఎఫ్ మాస్టర్ మైండ్లు హషీమ్ ను ప్రత్యేకంగా ఎంపిక చేసి మరీ కాశ్మీర్ దాడికి పంపించారని తెలిపాయి. 

పక్కా ఆధారాలు లభించాయి..

కాశ్మీర్ లో ఉగ్రవాదులకు అనుకూలంగా పని చేస్తున్నారన్న అనుమానంతో భారత సైన్యం అక్కడి స్థానికులను వందల మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో చాలా మందికి హషీమ్ మూసా తెలుసు. ఉగ్రవాద ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్స్‌, మూసాకు ఉన్న సైనిక నేపథ్యాన్ని కాశ్మీరీలు ధృవీకరించారని దర్యాప్తు బృందాలు తెలిపాయి. పాక్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ లో పని చేసిన మూసా తరువాత లష్కరేలోకి సహాయకారిగా వచ్చి..కరడుకట్టిన ఉగ్రవాదిగా మారాడని దర్యాప్తు బృందాల్ో అధికారి ఒకరు తెలిపారు. దీన్ని బట్టి పాక్ సైన్యానికి, ఉగ్రవాద సంస్థలకు మధ్య ఉన్న అనుబంధాన్ని అంచనా వేయొచ్చని చెప్పారు. 

పహల్గాంకు చేరుకునేందుకు ఉగ్రవాదులు  22 గంటల పాటు ట్రెక్కింగ్ చేశారు.  దాడులు జరిపేందుకు కోకెర్నాగ్‌ అడవుల నుంచి బైసరన్‌ లోయ వరకు నడుచుకుంటూ వచ్చారని దర్యాప్తు బృందాలు చెబుతున్నాయి. ఇదంతా చేయాలంటే ఉగ్రవాదులకు కఠిన శిక్షణ అవసరం. పాక్ పారా కమాండోలు ఈ రకమైన శిక్షణ పొందుతారు.   వీరు సంప్రదాయేతర యుద్ధతంత్రం, కోవర్ట్‌ ఆపరేషన్లలో దిట్టలు. వీరు శారీరకంగా, మానసికంగా బలోపేతం అయేందుకు ట్రైన్ చేస్తారు. అత్యాధునిక ఆయుధాలు, చేతులతో పోరాటం వంటివి నేర్పిస్తారు. దాడిలో పాల్గొన్న హషీమ్, మరో ఇద్దరు ఉగ్రవాదులు జునైద్‌భట్‌, అర్బాజ్‌ మిర్‌ కూడా ఇటువంటి శిక్షణ పొందారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారత సైన్యం శాయశక్తులా ప్రయత్నిస్తోందని దర్యాప్తు బృందాలు తెలిపాయి. ఇప్పటికే నాలుగుసార్లు దొరికినట్టే దొరికి తప్పించుకున్నారని చెప్పారు. 

today-latest-news-in-telugu | india | pakistan | army | terrorists | lashkar-e-taiba 

Also Read: Stock Market: లాభాల్లో దేశీ మార్కెట్లు..400 దాటిన సెన్సెక్స్

Advertisment
తాజా కథనాలు