/rtv/media/media_files/2025/04/28/krBKkV2jbjSlaJ2t7qpz.jpg)
Pahalgam attack terrorists
పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పెద్ద స్కెచ్చే ఉంది అని అంటోంది ఎన్ఐఏ. దాడి, దానికి పాలడ్డ ఉగ్రవాదులపై తీవ్రమైన దర్యాప్తు చేస్తోంది. ఇదేమీ అప్పటికప్పుడు అనుకుని చేసింది కాదు పక్కా ప్లానింగ్ తో ఉగ్రవాదులు దాడి చేశారని ఎన్ఐఏ
చెబుతోంది. దానికి సంబంధించి చాలా ఆధారాలు కూడా దొరికాయని తెలిపింది. తాజాగా సోషల్ మీడియాలో కూడా ఉగ్రవాదుల జాడ తెలిసిందని ఎన్ఐఏ చెప్పింది. సోషల్ మీడియాలో రెసిస్టెన్స్ టైమ్ అనే గ్రూప్ తో ఉగ్రవాదులు కనెక్ట్ అయ్యారని అంటోంది. ఇందులో 146 మంది సభ్యులుండగా...అందులో పాకిస్తాన్ కు చెందిన రాడికల్స్ ఎక్కువగా ఉన్నారని వివరాలు తెలిపింది ఎన్ఐఏ. అయితే ఈ గ్రూప్ ఏప్రిల్ 24న హఠాత్తుగా మూసేశారని చెప్పింది.
ప్రత్యేకమైన గ్రూప్..
రెసిస్టెన్స్ టైమ్ లో ఎక్కువగా జైషే పేరుతో రెచ్చగొట్టే పోస్టులు పెట్టారు. ఉగ్రవాద జైఫ్ ఎ మొహహ్మద్ నిర్వాహకులు కూడా ఈ గ్రూప్ లో ఉన్నట్లు తెలుస్తోందని ఎన్ఐఏ చెప్పింది. పహల్గామ్ లో దాడి జరిగిన రెండో రోజు ఏప్రిల్ 24న జైష్ అనే వ్యక్తి గ్రూప్ లో తనకు తుపాకులు కావాలి అంటూ పోస్ట్ పెట్టాడు. అంతేకాదు కాశ్మీర్ లో ఆయుధ డీలర్ల గురించి కూడా సమాచారం అడిగాడు. ఈ గ్రూప్ లో వ్యక్తులకు OGW అనే కోడ్ కూడా ఉందని ఎన్ఐఏ చెబుతోంది. అంతేకాదు పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన వీడియో కూడా ఈ గ్రూప్ లో పోస్ట్ చేయబడింది.
జిప్ లైన్ ఆపరేటర్ పై బలపడుతున్న అనుమానాలు..
మరోవైపు కాశ్మీర్ జిప్ లైన్ ఆపరేటర్ ముజమ్మిల్ మీద కూడా అనుమానం పెరుగుతోంది. ఇతనిపై కూడా ఎన్ఐఏ తీవ్ర దర్యాప్తు చేస్తోంది. ముజమ్మిల్ కు ఉగ్రవాదులు వచ్చారని, కాల్పులు జరుపుతారని తెలుసునని...అయినా కూడా పర్యాటకులను ఆపలేదని ఎన్ఐఏ చెప్పింది. విచారణలో కూడా ముజమ్మిల్ ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడ్డం అనుమానాలకు దారి తీస్తోందని తెలిపింది. అతను చెప్పేది, వీడియోలో కనిపిస్తున్న దానికి సరిపోలడం లేదని అంది.
today-latest-news-in-telugu | terrorists | Social Media | nia
Also Read: BIG BREAKING: మమ్మల్ని కాపాడండి...ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించిన పాక్