J&K: మరో ఉగ్రవాది ఇంటిని పేల్చేసిన బలగాలు

ఉగ్రవాదులను వెతికి పట్టుకోవడానికి బారత బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు మరో ఉగ్రవాది ఇల్లును పేల్చేశారు. ఫరూఖ్ అహ్మద్ తెడ్వా అనే ఎల్ఈటీ ఇంటిని కాల్చేశారు. 

New Update
blast

Terrorist House Blast

పహల్గామ్ దాడి జరిగిన తరువాత జమ్మూ , కాశ్మీర్ లోని భారత బలగాలు కంటి మీద కునుకు లేకుండా గాలింపు చేస్తున్నారు. ఉగ్రవాదుల జాడ ఎక్కడ ఉందని తెలిసినా అక్కడకు వెళుతున్నారు. ఇప్పటికే కొంతమందిని మట్టుబెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. దాంతో పాటూ ఉగ్రవాదుల ఇళ్ళను కూడా పేల్చేస్తున్నాయి బలగాలు. తాజాగా ఈరోజు కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో నారికూట్ కలరూస్ అనే ప్రాంతంలో ఫరూఖ్ అహ్మద్ తెడ్వా అనే లష్కరే తోయిబా ఉగ్రవాది ఇంటిని మట్టుబెట్టారు. లష్కరే తోయిబాలో ఫరూఖ్ ముఖ్య వ్యక్తి. ఇతను ప్రస్తుతం పాకిస్తాన్ నుంచి పని చేస్తున్నాడు. గత 48 గంటల్లో, ఆరుగురు ఉగ్రవాదులు లేదా వారి సహచరుల ఇళ్లను బలగాలు కూల్చివేసాయని, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న ఇతరులపై కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అలాగే  మొత్తం ఉగ్రవాద వ్యవస్థను నిర్వీర్యం చేయడానికే భారత భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయని.. శ్రీనగర్ లో 60కు పైగా ప్రదేశాలలో దాడులు నిర్వహించినట్లు జమ్మూ, కాశ్మీర్ పోలీసులు తెలిపారు. మరోవైపు బందీపురాలో ఉగ్రవాదులతో సంబంధాలు ున్నాయనే అనుమానంతో జమీల్ అహ్మద్ అనే వ్యక్తి ఇంటిని స్థానికులు పడగొట్టేశారు. 

అంతకు ముందు భారీ ఆయుధ సామాగ్రి..

పహల్గామ్ టెర్రర్ అటాక్ ఉద్రిక్త పరిస్థితుల్లో ఇండియన్ ఆర్మీ జమ్మూ కశ్మీర్‌ను జల్లెడ పడుతుంది. పాక్ సరిహద్దులో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో పర్యటకులపై దాడి చేసిన వారు కూడా జమ్మూ లోనే ఉండే అవకాశం ఉంది. భారత నిఘా వ‌ర్గాలు కూడా ఉగ్రవాదుల క‌ద‌లిక‌లను క్లోస్‌గా పరిశీలిస్తున్నాయి. జ‌మ్మూక‌శ్మీర్ కుప్వారా జిల్లాలో టెర్రరిస్టులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ పసిగట్టాయి. పక్కా సమాచారంలో స్పెష‌ల్ ఆప‌రేష‌న్ గ్రూప్, ఆర్మీ బ‌ల‌గాలు క‌లిసి జాయింట్‌గా మాచిల్ జిల్లాలో కూంబింగ్ నిర్వహించాయి. ఈ కూంబింగ్‌లో భాగంగా ఉగ్రవాదులు స్థావరాలు బయటపడ్డడాయి. అందులో భారీగా ఆయుధాలు, పేలుడు ప‌దార్థాలు ఉన్నాయి. వాటిని ఇండియన్ ఆర్మీ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. AK 47 గన్స్, మేగ‌జైన్లు, గన్స్, పేలుడు ప‌దార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఐదు AK47 రైఫిల్స్, ఎనిమిది AK-47 మేగ‌జైన్లు, ఒక పిస్తోల్‌తోపాటు మేగ‌జైన్, 660 రౌండ్ల బుల్లెట్లతో పాటు ఇత‌ర ఆయుధాల‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.  

today-latest-news-in-telugu | jammu-kashmir | terrorists 

Also Read: CSK : పెద్ద ప్లేయర్స్ ఆడటం లేదు..నేనేం చేయాలి..ధోని

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు