TGSRTC And Metro: IPL స్పెషల్.. క్రికెట్ లవర్స్ కోసం RTC, మెట్రో గుడ్ న్యూస్
TGSRTC IPL ప్రియులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చూసే అభిమానుల సౌకర్యార్థం స్పెషల్ బస్సులు వేసింది. మొత్తం 24 డిపోల నుంచి 60 స్పెషల్ బస్సులు నడపనుంది. అలాగే హైదరాబాద్ మెట్రో సైతం టైమింగ్స్ పెంచింది. ఆఖరి మెట్రో 12.15గం బయల్దేరనుంది.
SRH vs LSG : ఉప్పల్‌లో హై ఓల్టేజ్ మ్యాచ్..సన్‌రైజర్స్ ను భయపెడుతున్న సెంటిమెంట్!
ఉప్పల్ స్టేడియం వేదికగా మరో హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. SRH, LSG జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు ఇరు జట్లు నాలుగుసార్లు తలపడగా.. LSG మూడు, SRH ఒకసారి మాత్రమే గెలిచింది.
RR vs KKR : ఏంటీ ఇదంతా PR స్టంటా..కాళ్లు మొక్కడానికి పరాగ్ పదివేలు ఇచ్చాడా?
RR, KKR మ్యాచులో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. RR ఫీల్డింగ్ చేసే సమయంలో సెక్యూరిటీ కళ్లుగప్పి ఓ అభిమాని మైదానంలోకి దూసుకువచ్చాడు. నేరుగా వెళ్లి తన అభిమాన క్రికెటర్ రియాన్ పరాగ్ కాళ్లు మొక్కాడు. దీనిని పరాగ్ చేసిన PR స్టంట్ అని నెటిజన్లు అభివర్ణించారు.
Yashasvi Jaiswal : టీ20 క్రికెట్లో యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డు
టీమిండియా క్రికెటర్ యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్ లో అత్యంత వేగంగా 3,000 పరుగులు పూర్తి చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. జైస్వాల్ తన 106వ మ్యాచ్‌లో ఈ ఘనతను సాధించాడు.
Virat Kohli: అరె అచ్చం విరాట్ లాగే ఉన్నాడే.. ఎవరీ తుర్కియే కోహ్లీ!
మనిషిని పోలిన మనుషులు ఉంటారని వింటుంటాం. స్టార్ క్రికెటర్ కోహ్లీని పోలిన ఓ వ్యక్తి తుర్కియేలో దర్శనమిచ్చారు. టీవీ యాక్టర్ సెటిన్ గునర్ అచ్చం కింగ్‌ను పోలి ఉన్నారు. ఆయన ఫొటోలు వైరల్ కావడంతో అచ్చం కోహ్లీలా ఉన్నారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
DC VS LSG: లక్నో తొలి ఇన్నింగ్స్ క్లోజ్.. ఢిల్లీ ముందు టార్గెట్ ఇదే!
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతోన్న తొలి ఇన్నింగ్స్ ముగిసింది. లక్నో సూపర్ జెయింట్స్ నిర్దేశించిన 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 210 పరుగులు ఛేదించాల్సి ఉంటుంది.