Abhishek Sharma Ferrari : అభిషేక్ శర్మ కొత్త ఫెరారీ కారు ఊరమాస్.. ఫీచర్లు బుర్రపాడు బాబోయ్

అభిషేక్ శర్మ కొనుగోలు చేసిన ఫెరారీ పురోసంగ్యూ కారు ధర రూ.10.5 కోట్లుగా ఉంది. గంటకు 310 కిమీ కంటే ఎక్కువ వేగాన్ని అందుకుంటుంది. 6.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ V12 పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 725 హార్స్‌పవర్ (hp), 716 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

New Update
Abhishek Sharma Ferrari purosangue

Abhishek Sharma Ferrari purosangue

భారత యువ క్రికెటర్(team-india), ఆసియా కప్ 2025(Asia cup 2025) 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అభిషేక్ శర్మ(abhishek-sharma) తన కార్ల కలెక్షన్‌లో అత్యంత ఖరీదైన, విలాసవంతమైన కారును చేర్చుకున్నారు. అతను ఇటీవల ఫెరారీ పురోసాంగ్యూ (Ferrari Purosangue) లగ్జరీ SUVని కొనుగోలు చేశారు. ఫెరారీ నుంచి వచ్చిన మొట్టమొదటి 4-డోర్ల SUV ఇదే కావడం విశేషం. అభిషేక్ శర్మ కొనుగోలు చేసిన ఈ కారు నలుపు (స్లీక్ బ్లాక్) రంగు ఎక్స్‌టీరియర్, ఎరుపు (బ్రైట్ రెడ్) కలర్ ఇంటీరియర్‌తో స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఈ ఫెరారీ SUV భారతదేశంలో అరుదైన లగ్జరీ SUVగా ఉంది. ఇది దాని శక్తివంతమైన ఇంజిన్, లగ్జరీ, ప్రీమియం డిజైన్‌కు ప్రసిద్ధి చెందింది. అభిషేక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'V12' అనే క్యాప్షన్‌తో ఈ కారు ఫోటోలను పంచుకున్నారు. 

2025 ఆసియా కప్‌లో అతని అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన తర్వాత అభిషేక్ ఫెరారీ మొదటి SUV అయిన పురోసాంగును కొనుగోలు చేశారు. ఇప్పుడు దాని ధర, మైలేజీ, ఇంజిన్ సహా మరిన్ని వివరాల గురించి తెలుసుకుందాం. 

Also Read :  టీమిండియాకు గుడ్ న్యూస్.. ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. స్టార్ ఆల్ రౌండర్ దూరం

Ferrari Purosangue Price

భారతదేశంలో Ferrari Purosangue ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ.9.93 కోట్ల నుండి ప్రారంభమవుతుంది. కానీ ఆన్-రోడ్ ధర దాదాపు రూ.10.5 కోట్లగా ఉంటుంది. కంపెనీ అతి తక్కువ కార్లను మాత్రమే అందుబాటులో ఉంచింది. ఇది పరిమిత యూనిట్లలో లభించే ఫెరారీ మొదటి నాలుగు-డోర్ల SUV.

ఇంజిన్ - పనితీరు

Also Read :  PCB: సంక్షోభంలో పాకిస్తాన్ క్రికెట్..కెప్టెన్‌గా సల్మాన్ అఘా తొలగింపు

Ferrari Purosangue 6.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ V12 పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 725 హార్స్‌పవర్ (hp), 716 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. Ferrari Purosangue వెనుక టైర్ల డ్రైవ్‌తో 8-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ (DCT)తో వస్తుంది. దీంతో ఇది కేవలం 3.3 సెకన్లలో 0 నుండి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది. అదే సమయంలో గంటకు 310 కిమీ కంటే ఎక్కువ వేగాన్ని అందుకుంటుంది. ఇది తమ అత్యంత సెన్సిటీవ్, సౌండ్ లేని V12 ఇంజిన్ అని ఫెరారీ పేర్కొంది. అంచనా ప్రకారం.. ఫెరారీ పురోసాంగ్వే మైలేజ్ లీటరుకు దాదాపు 8.9 కి.మీ ఇస్తుందని సమాచారం.

Ferrari Purosangue 185 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. దీని ఇంటీరియర్‌లో డ్యూయల్-కాక్‌పిట్ లేఅవుట్, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో/ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, మసాజ్ ఫంక్షన్‌తో ముందు సీట్లు, వెనుక వేడిచేసిన సీట్లు వంటివి ఉన్నాయి. ఇది అడాప్టివ్ డంపర్లు, 360 డిగ్రీ కెమెరా, అనేక ఎయిర్ బ్యాగులను కలిగి ఉంది. 

Advertisment
తాజా కథనాలు