Cameron Green: టీమిండియాకు గుడ్ న్యూస్.. ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. స్టార్ ఆల్ రౌండర్ దూరం

భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ సైడ్ సోర్నెస్ (గాయం) కారణంగా జట్టు నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో ఫామ్‌లో ఉన్న బ్యాటర్ మార్నస్ లబుషేన్ ఆస్ట్రేలియా వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు.

New Update
Cameron Green ruled out of ODI series vs India; Marnus Labuschagne named replacement

Cameron Green ruled out of ODI series vs India; Marnus Labuschagne named replacement

భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌(IND Vs AUS ODI Series 2025)లో తొలి మ్యాచ్ పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందే ఆస్ట్రేలియా జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read :  సంక్షోభంలో పాకిస్తాన్ క్రికెట్..కెప్టెన్‌గా సల్మాన్ అఘా తొలగింపు

Cameron Green Ruled Out

ఆసీస్, భారత్ మధ్య అక్టోబర్ 19 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. దీని కోసం ఇరు జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే రెండు జట్ల టీంలను ప్రకటించారు. ఈ క్రమంలో ఈ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ గాయం కారణంగా జట్టుకు దూరం అయ్యాడు. ఈ ఊహించని పరిణామ్ ఆసీస్ జట్టుకు ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే చాలా మంది ఆటగాళ్లు గాయాల కారణంగా తమ జట్టుకు దూరమయ్యారు. 

ఇప్పుడు ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ గాయం కారణంగా మూడు మ్యాచ్ ల సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ట్రైనింగ్ సమయంలో గ్రీన్ స్వల్పంగా గాయపడ్డాడు. దీంతో అతడు ప్రాక్టీస్ చేయలేకపోయాడు. ఇప్పుడు అతడి స్థానంలో టాప్ ఆర్డర్ బ్యాట్సమన్ మార్నస్ లాబుస్చాగ్నేను తీసుకొచ్చారు. కాగా మొదట మార్నస్ లాబుస్చాగ్నేను ఆస్ట్రేలియా జట్టు నుంచి తప్పించారు. కానీ దేశవాళీ క్రికెట్‌లో అతని అద్భుతమైన ప్రదర్శన ఇప్పుడు అతనికి అవకాశం తెచ్చిపెట్టింది.

కామెరాన్ గ్రీన్(cameron-greene) ఇటీవలే తన వెన్నుగాయం నుంచి కోలుకుని బౌలింగ్ లోకి తిరిగి వచ్చాడు. ఇంతలో ఇప్పుడు కొత్త గాయం ఆస్ట్రేలియాకు పెద్ద దెబ్బే అని చెప్పాలి. గ్రీన్ తన చివరి వన్డేలో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. దాదాపు 118* పరుగులు చేసి జట్టుపై భారీ ఆశలు పెంచుకున్నాడు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ''కామెరాన్ గ్రీన్ గాయం స్వల్పమే. అతను ఈ నెలాఖరు నాటికి దేశీయ క్రికెట్‌కు తిరిగి రావచ్చు. అనంతరం అతను వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో జరిగే మొదటి యాషెస్ టెస్ట్‌కు సిద్ధం కావచ్చు." అని తెలిపింది. 

ఆసీస్ వన్డే జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మాథ్యూ కుహ్నెమాన్, మార్నస్ లాబుస్చాగ్నే, మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్, మాథ్యూ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్.

2, 3 మ్యాచ్‌లకు మాత్రమే ఆడమ్ జంపా, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్ ఆడనున్నారు. 

భారత్ వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ సిరాజ్, హర్షిత్ సిరాజ్, హర్షిత్ రానా, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్) మరియు యశస్వి జైస్వాల్.

Also Read :  అద్భుతమైన బ్యాటింగ్.. అభిషేక్ శర్మ, స్మృతి మంధానకు అరుదైన అవార్డు!

వన్డే షెడ్యూల్: 

అక్టోబర్ 19 - మొదటి వన్డే, పెర్త్;
అక్టోబర్ 23 - రెండవ వన్డే, అడిలైడ్
అక్టోబర్ 25 - మూడవ వన్డే, సిడ్నీ

Advertisment
తాజా కథనాలు