PCB: సంక్షోభంలో పాకిస్తాన్ క్రికెట్..కెప్టెన్‌గా సల్మాన్ అఘా తొలగింపు

వరుస ఓటములతో పాకిస్తాన్ క్రికెట్ సంక్షోభంలో కూరుకుపోయింది. రీసెంట్‌గా జరిగిన ఆసియా కప్‌లో భారత్ చేతిలో ఘోర ఓటమి పాలవడంతో ఆ టీమ్ కెప్టెన్ సల్మాన్ అఘాను కెప్టెన్సీ నుంచి తొలగించారు.

New Update
salman agha

ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ జట్టు(pakistan-team) ఎవరితోనూ గెలిచిన దాఖలాలు లేవు. ఆ దేశం అసలు క్రికెట్ ఆడుతున్నదే చాలా తక్కువ. వారితో మ్యాచ్‌లు ఆడడానికి చాలా దేశాలు ఇష్టపడడం లేదు. దానికి తోడు ఆడిన సీరీస్‌లు, టోర్నీల్లో కూడా పాక్ జట్టు గెలవడం లేదు. దీంతో పాక్ జట్టు సంక్షోభంలో కూరుకుపోయింది. టీమ్ మొత్తాన్ని మారిస్తేగానీ వీలులేదని పీసీబీ(pcb) ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా ముందుగా కెప్టెన్ పదవి నుంచి సల్మాన్ అఘాను తప్పించారు. తదుపరి కెప్టె్‌గా ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్‌ను నియమించనున్నారు. ఇతను కూడా ప్రస్తుతానికి టీ20 కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. 

Also Read :  అభిషేక్ శర్మ కొత్త ఫెరారీ కారు ఊరమాస్.. ఫీచర్లు బుర్రపాడు బాబోయ్

కెప్టెన్‌గా సల్మాన్ అఘా ఫెయిల్..

2026లో టీ20 వరల్డ్ కప్‌(T20 World Cup 2026)కు భారత్, శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యం వహించనున్నాయి. దీని కోసం పీసీబీ తమ జట్టును ఇప్పటినుంచే సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం భుజం శస్త్రచికిత్సలో ఉన్న షాదాబ్...దాని నుంచి కోలుకోగానే అతను టీ20 టీమ్‌కు కెప్టెన్‌గా నియమించబడతాడని బోర్డు తెలిపింది. 2025 ఆసియా కప్‌లో భారత్‌పై పాకిస్తాన్ పేలవ ప్రదర్శన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని పీసీబీ చెప్పింది. అంతేకాదు కెప్టెన్‌గా సల్మాన్ అఘా ప్రదర్శన కూడా పేలవంగా ఉంది. ఫైనల్ మ్యాచ్‌లో ఒక వికెట్ నష్టానికి 113 పరుగులతో బలమైన ఆరంభం ఉన్నప్పటికీ.. జట్టు నాటకీయ పతనాన్ని చవిచూసింది. కేవలం 33 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయి 146 పరుగులకే ఆలౌటైంది. మరోవైపు భారత్‌ను తిలక్ వర్మ ఒంటి చేత్తో గెలిపించాడు. ఇది కేవలం సల్మాన్ చెత్త కెప్టెన్సీ వల్లనే ఇలా అయిందని పీసీబీ ఆరోపిస్తోంది. టోర్నమెంట్‌లో అఘా సల్మాన్ వ్యక్తిగత ప్రదర్శన చాలా పేలవంగా ఉంది, ఏడు మ్యాచ్‌ల్లో 80.90 స్ట్రైక్ రేట్ మరియు కేవలం 12 సగటుతో కేవలం 72 పరుగులు మాత్రమే చేశాడని చెబుతోంది. 

ఇక కొత్త కెప్టెన్ షాదాబ్ ఖాన్ విషయానికి వస్తే..ఇతను 112 T20లలో పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. దాంతో పాటూ వన్డే జట్టుకు వైస్ కెప్టెన్ గా కూడా పని చేశాడు. లెగ్-స్పిన్నింగ్ ఆల్ రౌండర్‌గా షాదాబ్ ఖాన్ కెప్టెన్సీ పాత్రకు విలువైన నైపుణ్యాలను తెస్తాడు. మిడిల్ ఓవర్ స్పిన్నర్‌గా,లోయర్-ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా అతను సహకారం అందిచగలడని పీసీబీ చెబుతోంది. దాంతో పాటూ ఎక్కడ ఎవరిని ఉపయోగించాలో కనుగొనడంలో ఇబ్బంది పడుతున్న జట్టులో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడానికి షాదాబ్ సరైనవాడని బోర్డు భావిస్తోంది. 

Also Read :  టీమిండియాకు గుడ్ న్యూస్.. ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. స్టార్ ఆల్ రౌండర్ దూరం

Advertisment
తాజా కథనాలు