Salman Ali Agha : దెబ్బ మీద దెబ్బ.. పాకిస్తాన్ కెప్టెన్ కు దిమ్మతిరిగే షాక్!

ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో పాక్ వరుస పరాజయాలన ఎదురుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

New Update
pcb pak

ఆసియా కప్ 2025(Asia cup 2025) టోర్నమెంట్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో పాక్(ind-vs-pak) వరుస పరాజయాలన ఎదురుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. టోర్నీలో కెప్టెన్‌గా వ్యవహరించిన సల్మాన్ అలీ ఆఘాపై వేటు వేసేందుకు పీసీబీ సిద్దమైనట్లు సమాయారం. అతని స్థానంలో ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్‌కు టీ20 జట్టు పగ్గాలు అప్పగించాలని బోర్డు యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఆసియా కప్‌లో భాగంగా కేవలం 15 రోజుల వ్యవధిలోనే పాకిస్తాన్ మూడు సార్లు భారత్ చేతిలో ఓటమి పాలైంది. సెప్టెంబర్ 14న జరిగిన గ్రూప్ మ్యాచ్ తో పాటుగా సెప్టెంబర్ 21న జరిగిన  సూపర్-4,  సెప్టెంబర్ 28న జరిగిన ఫైనల్‌లోనూ పాక్ భారత జట్టుపై ఓటమిపాలైంది. ఈ వరుస పరాజయాలు కెప్టెన్సీ మార్పునకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఒకానొక దశలో 113/1 తో పటిష్టంగా ఉన్నప్పటికీ, ఆ తర్వాత కేవలం 33 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులకే ఆలౌట్ అయ్యింది.  భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ 30 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించాడు. 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, తిలక్ వర్మ 69 పరుగులతో రాణించడంతో భారత్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

Also Read :  PCB : ఆఫ్ఘనిస్తాన్ వైదొలగినా ట్రై-సిరీస్‌ జరుగుతుంది..పాక్ క్రికెట్ బోర్డు కీలక ప్రకటన

Also Read :  Pakistan-Afghanistan war 2025: పాకిస్తాన్ దాడిపై రషీద్ ఖాన్ సహా స్టార్ క్రికెటర్ల షాకింగ్ రియాక్షన్

బ్యాటింగ్‌లో దారుణంగా విఫలం

ఇక  కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా కూడా బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. టోర్నీలో ఏడు మ్యాచ్‌ల్లో కేవలం 72 పరుగులు మాత్రమే చేశాడు.  సగటున 12 పరుగులు సాధించాడు.  కెప్టెన్సీ నిర్ణయాలపై కూడా తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఫైనల్ అనంతరం సల్మాన్ ఆఘా మీడియా సమావేశంలో భారత్‌కు పోటీగా రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయడం, రన్నరప్‌ చెక్కును విసిరేయడం వంటి ఘటనలు కూడా పీసీబీని అసంతృప్తికి గురిచేశాయి.2026 టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని జట్టు వ్యూహాన్ని మార్చడంలో భాగంగా ఆఘాను తొలగించాలని పీసీబీ నిర్ణయించినట్లుగా సమాచారం. 

భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న షాదాబ్ ఖాన్ కోలుకున్న తర్వాత అతనికి టీ20 కెప్టెన్సీని అప్పగించే అవకాశం ఉంది.  షాదాబ్‌కు అంతర్జాతీయ టీ20లతో పాటు ఫ్రాంచైజీ లీగ్‌లలోనూ నాయకత్వ అనుభవం ఉంది. పాకిస్తాన్ క్రికెట్ జట్టులో రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విషయంలో పీసీబీ త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. 

ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లు వివాదాలతో వార్తల్లో నిలిచాయి. భారత్ ఆటగాళ్లు టాస్ సమయంలో, మ్యాచ్‌ల తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి నిరాకరించారు. దీనికి పాకిస్తాన్ జట్టు తీవ్రంగా స్పందించింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ నుండి ట్రోఫీని తీసుకోవడానికి భారత కెప్టెన్ నిరాకరించడంతో, నఖ్వీ అవార్డును తీసుకుని వెళ్లిపోవడంతో టోర్నమెంట్ ముగింపు కూడా సజావుగా సాగలేదు.

Advertisment
తాజా కథనాలు