Iran-Israel: రెచ్చిపోతున్న ఇరాన్..ఇజ్రాయెల్ పైనా దాడులు
ఇరాన్ దాడులతో విరుచుకుపడుతోంది. ఇటు అమెరికా సైనిక స్థావరాలపైనా..అటు ఇజ్రాయెల్ పైనా ఒక్కసారే దాడులకు తెగబడుతోంది. టెహ్రాన్‌లో బాంబులు పేలుతుండడంతో అక్కడ సైరన్లు మోగుతున్నాయి.
ఇరాన్ దాడులతో విరుచుకుపడుతోంది. ఇటు అమెరికా సైనిక స్థావరాలపైనా..అటు ఇజ్రాయెల్ పైనా ఒక్కసారే దాడులకు తెగబడుతోంది. టెహ్రాన్‌లో బాంబులు పేలుతుండడంతో అక్కడ సైరన్లు మోగుతున్నాయి.
ప్రపంచంలో ఎక్కడ గొడవున్నా నేనున్నా అంటూ అమెరికా దూరుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా వచ్చింది. చెప్పపెట్టకుండా ఉన్నట్టుండి దాడులు చేసింది. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. మిడిల్ ఈస్ట్ లో ఉన్న అమెరికా కీలక స్థావరాల మీద విరుచుకుపడుతోంది.
లండన్ నుండి ముంబై వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో 7గురు అస్వస్థతకు గురయ్యారు. దీంతో విమానం ముంబై ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన తర్వాత.. వారందరినీ మెడికల్ రూమ్‌కు తరలించి ట్రీట్మెంట్ అందించారు. ప్రస్తుతం వారి పరిస్థితి మెరుగుపడినట్లు తెలుస్తోంది.
అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్ దాడులు చేపట్టింది. ట్రంప్ యుద్ధం ముగిసిందని ప్రకటించింది కానీ ఇరాన్ మాత్రం ఏం లేదు అని చెబుతోంది. గల్ఫ్ కంట్రీస్ లో ఇరాన్ దాడులు చేస్తున్న కారణంగా అవన్నీ తమ గగనతలాలను మూసేశాయి.
ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ చేసిన ప్రకటనను ఇరాన్ ఖండించింది. ఇజ్రాయెల్‌తో ఇప్పటివరకు ఎలాంటి సీజ్ఫైర్ ఒప్పందం జరగలేదని ఆ దేశ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి తెలిపారు.
భారత మాజీ క్రికెటర్ దిలీప్ దోషి 77 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. దిలీప్ దోషి మృతి పట్ల బీసీసీఐ సంతాపం వ్యక్తం చేసింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహించిన దిలీప్ 238 FC మ్యాచుల్లో 898 వికెట్లు తీశారు.
ఇరాన్ చివరి షా అయిన మొహమ్మద్ రెజా పహ్లవి కొడుకు రెజా పహ్లవి రంగంలోకి దిగారు. ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేసిన తర్వాత ఖమేనీ ఏం సాధించారంటూ నిలదీశారు. ఖమేనీ దిగిపోవాల్సిన సమయం వచ్చిందన్నారు.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఉప ఎన్నికల కౌంటింగ్ వద్ద విషాదం చోటుచేసుకుంది. కాళీగంజ్ నియోజకవర్గంలో జరిగిన కౌంటింగ్‌లో ఒక్కసారిగా నాటు బాంబు పేలింది. ఈ ప్రమాదంలో 10 ఏళ్ల బాలిక మృతి చెందడం కలకలం రేపింది.
తాను రాజ్యసభకు వెళ్లడం లేదని ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇప్పటికే తనను చాలాసార్లు వార్తల్లో రాజ్యసభకు పంపారని అన్నారు. తాను అక్కడికి వెళ్లడం లేదని.. ఎవరిని నామినేట్ చేయాలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయిస్తుంది.