Sankranti 2026: గంటల తరబడి రోడ్లపైనే నిరీక్షణ...సంక్రాంతికి బారులు తీరిన వాహనాలు...అయినను పోయిరావాలె

హైదరాబాద్‌,విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం  కూడా వాహన రద్దీ కొనసాగింది. సోమవారం తెల్లవారు జామున కూడా రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతి పండుగకు ముందు రెండో శనివారం,ఆదివారం సెలవులు కలిసి రావడంతో హైదరాబాద్‌లో నివసించే ప్రజలు తమ స్వగ్రామాల బాట పట్టారు.

New Update
FotoJet - 2026-01-12T081143.996

Waiting on the roads for hours

Traffic Jam: హైదరాబాద్‌,విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం  కూడా వాహన రద్దీ కొనసాగింది. సోమవారం తెల్లవారు జామున కూడా రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతి పండుగ(sankranthi2026) కు ముందు రెండో శనివారం,ఆదివారం సెలవులు కలిసి రావడంతో హైదరాబాద్‌లో నివసించే ప్రజలు తమ స్వగ్రామాల బాట పట్టారు. ఒకేసారి భారీగా వాహనాలు తరలిరావడంతో యాదాద్రి జిల్లా పంతంగి టోల్‌ ప్లాజా వద్ద వాహనాలు  కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.  దీంతో హైవేపై ట్రాఫిక్‌జామ్‌(traffic jam issue due to sankranti festival) ఏర్పడింది.

Also Read :  జిల్లాల పునర్ వ్యవస్థీకరణ కు అంతా సిద్ధం..కుదింపుకే మొగ్గు

Heavy Traffic On Hyderabad - Vijayawada N.H

Heavy Traffic Jam In Vijayawada-Hyderabad Highway PHotos (2)

Heavy Traffic Jam In Vijayawada-Hyderabad Highway PHotos (4)

టోల్‌ప్లాజాల వద్ద వాహనాల టోల్‌ చెల్లింపుల కోసం ఫాస్టాగ్‌ విధానం అమలులో ఉన్నప్పటికీ వాహనాలు పరిమితికి మించి రావడం, కొన్ని వాహనాల ఫాస్టాగ్‌లు స్కాన్‌ కాకపోవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయని టోల్‌ ప్లాజా నిర్వాహకులు, పోలీసులు చెబుతున్నారు. టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్‌జామ్‌ అవడంతో జీఎంఆర్‌ టోల్‌గేట్‌ సిబ్బంది వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద ఫాస్టాగ్ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టోల్ చెల్లింపులు సక్రమంగా జరగకపోవడంతో వాహనాలు నిలిచిపోయి రద్దీ మరింత పెరిగింది. మరోవైపు జాతీయ రహదారి-65పై వాహనాల రద్దీ ఈ రోజు కూడా కొనసాగింది.  పలు ప్రాంతాల్లో వాహనాల సంఖ్య పెరగడంతో రహదారి బ్లాక్ స్పాట్స్ వద్ద జాగ్రత్త చర్యలు కనిపించకపోవడం వాహనదారులను ఆందోళనకు గురి చేసింది.  - hyderabad-traffic-jam

Also Read :  ఖాళీ అవుతున్న హైదరాబాద్..బోసి పోయిన రోడ్లు

Heavy Traffic Jam In Vijayawada-Hyderabad Highway PHotos (6)

Heavy Traffic Jam In Vijayawada-Hyderabad Highway PHotos (7)

Heavy Traffic Jam In Vijayawada-Hyderabad Highway PHotos (8)

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జాతీయ రహదారి 65 పై ప్రయాణికుల రాకపోకలను, ట్రాఫిక్ ను చిట్యాలలో డీఎస్పీ శివరాం రెడ్డి సీఐ నాగరాజు ఎస్సై మావిడి రవికుమార్ ఎస్పీలతో శరత్‌చంద్ర పవార్ పరిశీలించారు. జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ నియంత్రణ చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.వాహనాల ప్రవాహం సాఫీగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. ముఖ్యంగా బస్సులు, లారీలు, వ్యక్తిగత వాహనాల కదలికలను పర్యవేక్షిస్తూ ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తెలిపారు. పండుగ వేళ ప్రయాణికుల భద్రతే ప్రథమ లక్ష్యమన్నారు.  ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.

Heavy Traffic Jam In Vijayawada-Hyderabad Highway PHotos (9)

Heavy Traffic Jam In Vijayawada-Hyderabad Highway PHotos (10)

Heavy Traffic Jam In Vijayawada-Hyderabad Highway PHotos (11)

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బెంగళూరుకు చెందిన వేలాది మంది ప్రజలు తమ స్వస్థలాలకు తిరిగి వెళుతున్నారు. ఫలితంగా అనేక కీలక జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. నగరంలోని ప్రధాన మార్గాలలో ఒకటైన ఎల్బీ నగర్ లో తెల్లవారుజాము నుంచే భారీ ట్రాఫిక్ నెలకొంటోంది.ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) వి.శ్రీనివాసులు మాట్లాడుతూ… మునుపటి సంవత్సరాల్లో కనిపించిన రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందుగానే ట్రాఫిక్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు."ట్రాఫిక్ సజావుగా సాగేలా ప్రత్యేక చర్యలు అమలు చేయబడ్డాయి. అడ్డంకులను తగ్గించడానికి, రాంగ్ పార్కింగ్ ప్రాంతాల్లో నిలిపి ఉంచిన వాహనాలను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నాం "అని ఆయన చెప్పారు.

Heavy Traffic Jam In Vijayawada-Hyderabad Highway PHotos (13)

Heavy Traffic Jam In Vijayawada-Hyderabad Highway PHotos (14)

Heavy Traffic Jam In Vijayawada-Hyderabad Highway PHotos (15)

సంక్లిష్టమైన ప్రదేశాలలో పోలీసులు అదనపు సిబ్బందిని ఉంచుతున్నారు. అదనంగా ట్రాఫిక్ పర్యవేక్షణ బృందాలను మోహరిస్తున్నారు. వాహనాలు సాఫీగా ముందుకు వెళ్లేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.పండుగ రద్దీ సమయంలో అసౌకర్యాన్ని నివారించడానికి ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. పోలీసు సిబ్బందికి వాహనదారాలు సహకరించాలని కోరుతున్నారు. మరోవైపు హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ భారీగా పెరుగుతోంది.గడిచిన రెండు మూడు రోజులుగా ఇదే పరిస్థితి ఉంటోంది. హైవేపై దారి పొడవునా వాహనాలు బారులు తీరాయి. ముఖ్యంగా చౌటుప్పల్‌ పట్టణంతో పాటు పంతంగి టోల్‌ ప్లాజా వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటోంది.

Heavy Traffic Jam In Vijayawada-Hyderabad Highway PHotos (16)

Heavy Traffic Jam In Vijayawada-Hyderabad Highway PHotos (17)

Heavy Traffic Jam In Vijayawada-Hyderabad Highway PHotos (18)

Advertisment
తాజా కథనాలు