/rtv/media/media_files/2026/01/11/sonic-weapon-2026-01-11-21-30-09.jpg)
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోని అమెరికా బంధీచేయడం ప్రపంచాన్ని నివ్వెరపర్చింది. ఆయన్ను కస్టడీలోకి తీసుకునేందుకు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో యూఎస్ అత్యంత శక్తిమంతమైన ఆయుధాన్ని వాడిందట. అది సైనికులపై విషంలా పని చేసింది. క్షణాల్లోనే వారు ఉపయోగించిన కెమికల్ మదురో భద్రతా సిబ్బంది సామర్థ్యాన్ని దెబ్బతీసింది.
‘‘మేం నికోలస్‌కు రక్షణగా విధుల్లో ఉన్నాం. అకస్మాత్తుగా మా రాడార్ వ్యవస్థలు పనిచేయడం ఆగిపోయాయి. ఏం జరిగిందో మాకు అర్థమయ్యేలోపే డ్రోన్ల గుంపు మా దగ్గరకు వచ్చేసింది. వాటిపై ఎలా స్పందించాలో అర్థం కాలేదు. తర్వాత 20 మంది సైనికులతో 8 హెలికాప్టర్లు వచ్చాయి. సంఖ్య తక్కువే అయినా.. వెంటనే మొత్తం తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. వారు లెటెస్ట్ టెక్నాలజీలో ఎంతో ముందున్నారు. ఇంతకుముందు చూడని పోరాట పద్ధతులను ఉపయోగించారు. అమెరికా శక్తి ముందు వెనెజువెలా సైన్యం తేలిపోయింది. మేం వందల సంఖ్యలో ఉన్నా ఉపయోగం లేకపోయింది’’
US used powerful sonic weapon that brought Venezuelan soldiers to their knees during Maduro raid: witness account https://t.co/BkYPuEAwGupic.twitter.com/cdtP3BYDaU
— New York Post (@nypost) January 10, 2026
‘‘ఒక దశలో వారు ఏదో ప్రయోగించారు. దానిని ఎలా వర్ణించాలో తెలియడం లేదు. అది తీవ్రమైన ధ్వని తరంగంలాంటిది. నా తల లోపలినుంచి పేలిపోతున్నట్లు అనిపించింది. మా ముక్కుల నుంచి రక్తం కారడం మొదలైంది. కొందరు వాంతులు చేసుకున్నారు. ఇంకొందరు నేలపై పడిపోయారు. ఆ సోనిక్ ఆయుధం ముందు మేం నిల్చోలేకపోయాం. అగ్రరాజ్యం USA తో పోరాడగలమని ఎవరైనా అనుకుంటే అది భ్రమే అవుతుంది’’ అని ఆ సెక్యూరిటీ గార్డ్ వెల్లడించిన వివరాలను న్యూయార్క్ పోస్ట్ ప్రచురించింది. గార్డ్ చెప్పిన మాటలను వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ షేర్ చేశారు.
కాగా.. గార్డ్ చెప్పిన దానిని బట్టి వెనెజువెలా లక్ష్యాలను నిర్వీర్యం చేయడానికి మైక్రోవేవ్స్, లేజర్స్ వంటి వాటిని వాడి ఉండొచ్చని అమెరికా నిఘా విభాగంలో పనిచేసిన అధికారి ఒకరు వెల్లడించారు. అలాంటి వెర్షన్లు యూఎస్ సైన్యంలో దశాబ్దాల క్రితం నుంచే ఉన్నాయని పేర్కొన్నారు. వాటిలో కొన్నింటి వల్ల రక్తస్రావం, నొప్పి, మంట, నిస్సత్తువ వంటి సమస్యలు ఎదురవుతాయి. 2020లో గల్వాన్ ఘర్షణలో భారత సైనికులపై చైనా మైక్రోవేవ్ వెపన్ వాడిందనే ఆరోపణలు వినిపించాయి. అయితే వాటిని ఆ దేశం తోసిపుచ్చింది.
Follow Us