/rtv/media/media_files/2026/01/12/fotojet-2026-01-12t092939-2026-01-12-09-29-57.jpg)
Bhuma akhila priya vs jagan mohan reddy
ఎన్నో ఏళ్ల నుంచి కలిసిమెలిసి ఉన్న రెండు కుటుంబాల మధ్య నంద్యాల సహకార డైరీ చైర్మన్ పదవి చిచ్చు(Bhuma Akhila Priya MASS WARNING to Vijaya Dairy chairman) రేపుతోంది. కుటుంబ సంబంధాల కన్న పదవే ముఖ్యమని కయ్యానికి దిగాయి రెండు కుటుంబాలు. ఓ వైపు మామను కుర్చీ నుంచి దింపేందుకు అక్క, తమ్ముడి ప్రయత్నాలు.. మరో వైపు చైర్మెన్ పీఠం చేజారి పోకుండా ఎత్తుకు పై ఎత్తు వేస్తున్న మామ.. చైర్మన్ పీఠం కోసం పోటీ పడుతున్న మామ కోడలుపై ప్రత్యేక కథనం.
నంద్యాలలో వైసిపి, టిడిపి నాయకుల మధ్య రాజకీయ రగడ జరుగుతోంది. పాల ఉత్పత్తిదారుల సహకారం సంఘం ఎన్నికల్లో ఇద్దరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవమన్నాయని ఎన్నికల అధికారి ప్రకటించడం వివాదాస్పదాంగా మారింది. కానీ ఎంపిడిఓ కార్యాలయం మూసి ఉండడంతో ఎవరు నామినేషన్ వేయలేదు అన్నది ఎంపిడిఓ వాదన. ఇప్పుడు ఈ అంశమే భూమా, ఎస్వీ కుటుంబాల మధ్య చిచ్చుకు కారణమైంది.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో భూమా, ఎస్వీ కుటుంబాలంటే రాజకీయంగా చాలా ఫేమస్. వారంటే తెలియని వారుండరు. గత కొన్నేళ్ల నుంచి నంద్యాల పాల డైరీ చైర్మెన్ పదవి భూమా కుటుంబ సభ్యులే పదవి అనుభవిస్తూ వచ్చారు. అయితే గత వైసీపీ హయంలో ఎస్వీ జగన్ మోహన్ రెడ్డి చైర్మన్ పదవిలో కొనసాగుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూమా కుటుంబానికి మళ్లీ ఆ చైర్మన్ పదవి దక్కించుకోవాలని ఆశ పుట్టింది.దీంతో ఈ దిశగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ పావులు కదుపుతున్నారు.
Also Read : సంక్రాంతి సందడి.. సొంతూళ్లకు బయలుదేరిన నగరవాసులు.. భారీగా ట్రాఫిక్ జామ్
Bhuma vs SV Families Challenge In Allagadda
దీంతో భూమా ,ఎస్వీ కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఈ క్రమంలోనే డైరీ చైర్మెన్ జగన్మోహన్ రెడ్డి(jagan-mohan-reddy) పై పలు ఆరోపణలు వచ్చాయి. వీటినే ఆయుధంగా చేసుకున్న భూమా అఖిలప్రియ తన మామ జగన్మోహన్ రెడ్డిని పదవి నుంచి దింపి తన తమ్ముడు భూమా విఖ్యాత రెడ్డిని కూర్చోబెట్టాలనేదే టార్గెట్ .
దీంతో చైర్మన్ పీఠంపై మామ, కోడలి మధ్య రాజకీయ వైరం స్టార్ట్ అయింది. దీని కోసమే మామ జగన్మోహన్ రెడ్డికి సైలెంట్ గా చెక్కు పెడుతున్నట్లు తెలుస్తోంది. అఖిలప్రియ(bhuma-akhilapriya) వ్యూహాలను తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి అప్రమత్తమై ప్రతి వ్యూహాలను అమలు చేస్తున్నారు. తన పదవికి ఎసరు రాకుండా చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మామ, కోడలు మధ్య డైరీ ఆస్తుల విషయంలో వివాదం మరింత ముదిరింది. దీంతో ఒకరిపై మరొకరు సవాళ్ల పర్వం స్టార్ట్ చేశారు. పాల డైరీ ఆస్తులను జగన్మోహన్ రెడ్డి కబ్జా చేశారని తమ్ముడు విఖ్యాతి రెడ్డితో పాటు అఖిలప్రియ ఆరోపిస్తున్నారు.
తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని ఆరోపణలు నిరూపించలేకపోతే పదవికి రాజీనామా చేయాలని సవాల్ చేశారు జగన్మోహన్ రెడ్డి. విజయ డైరీ నుంచి కోటి 30 లక్షల అప్పు తీసుకున్న భూమా కుటుంబం 2020 నుంచి పైసా చెల్లించలేదని చైర్మెన్ వాదన. బకాయి డబ్బులు కట్టమని అన్నందుకు తనపై కక్ష కట్టి అక్రమ కేసులు పెడుతున్నారని జగన్ మోహన్ రెడ్డి వాదన.
డైరీ నుంచి అప్పు తీసుకుంటే వైసిపి అధికారంలో ఉండగా ఎందుకు అడగలేదనేది అఖిల ప్రియ వాదన. డైరీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు బయటపడతాయని తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అఖిలప్రియ వాదిస్తోంది. సమయం వచ్చినప్పుడు చైర్మన్ తప్పుల చిట్టా బయట పెడతానని భూమా అఖిల ప్రియ హెచ్చరించారు. దీంతో నంద్యాల జిల్లా రాజకీయాలు హీటెక్కయి..
వైసిపి, టిడిపి నాయకులు మధ్య మాటలు యుద్ధం జరుగుతున్న క్రమంలోనే విజయ పాల డైరీ ఎన్నికల నగరా మోగింది. ఎన్నికలను భూమా, గంగుల కుటుంబాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రుద్రవరం మండలం మాచినేనిపల్లె పాల ఉత్పత్తి సహకార సంఘం ఎన్నికల్లో ఎస్వీ జగన్మోహన్ రెడ్డి , జల్లయ్య మాత్రమే నామినేషన్లు వేశారని ఎన్నికల అధికారి ప్రకటించారు. కానీ ఎంపీడీవో మాత్రం ఎవరు నామినేషన్ వేయలేదనే అన్నారు. రెండు నామినేషన్ లు దాఖలు అవ్వడంతో పాలసహకార సంఘం ఎన్నికలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. ఎన్నికల అధికారి వైసిపికి అనుకూలంగా పనిచేశారని వాదనలు భూమా అఖిల ప్రియ గట్టిగా వినిపిస్తుంది.
గతంలో చక్రవర్తులపల్లె సొసైటీ డైరెక్టర్ గా ఉన్న భూమా విఖ్యాత్ రెడ్డి 2020లో రూ.కోటి 30 లక్షలకుపైగా అప్పు తీసుకున్నారు. ఇవి సకాలంలో చెల్లించకపోవడంతో యాజమాన్యం విఖ్యాత రెడ్డికి అనేక సార్లు నోటీసులు ఇచ్చిన స్పందించలేదని వైరివర్గం వాదిస్తోంది. మాక్స్ చట్టం ప్రకారం డెయిరీ కి పాల సరఫరాకు తీసుకున్న అప్పు చెల్లించలేదని చక్రవర్తుల పల్లె డైరెక్టర్ గా ఉన్న భూమా విఖ్యాత్ రెడ్డిని డిపాల్టర్ గా ప్రకటించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ముత్యాల పాడు సొసైటీ ఎన్నికలు జరిగాయి. ఆ సొసైటీ సభ్యులు భూమా విఖ్యాత్ రెడ్డిని సొసైటీ డైరెక్టర్ గా ఎనుకున్నారు. అయితే ఈ ఎన్నిక మాక్స్ చట్టం ప్రకారం చెల్లదంటూ డైరీ త్రిసభ్య కమిటీ ముత్యాల పాడు సొసైటీ సభ్యులకు నోటీసులు ఇచ్చింది. కానీ వివరణ ఇచ్చేందుకు సొసైటీ సభ్యులకు బదులు విఖ్యాత్ రెడ్డి రావడంతో వివాదం మరింత ముదిరింది. డైరీలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు త్రిసభ్య కమిటీ సభ్యులు రవి కాంత్ రెడ్డి, ఎండీ ప్రదీప్ పై బైండోవర్ కేసులు నమోదు చేశారు. దీంతో చైర్మన్ ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.
ఈ డైరీ పరిధిలోని 21 పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం ఎన్నికలు ఆరు విడతల్లో జరుగుతున్నాయి. ఐదు విడతలు పూర్తి అయ్యాయి. మిగిలిన ఒక విడత జరగాల్సిన ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతుంది.
Also Read : AP TET ఫలితాలు విడుదల
Follow Us