Grok Obscene Images: గ్రోక్‌తో అసభ్యకర కంటెంట్‌.. 600 ఖాతాలు డిలీట్‌ చేసిన ఎక్స్

ఎక్స్‌లో గ్రోక్‌ను వినియోగించి అశ్లీల కంటెంట్‌ క్రియేట్‌ చేస్తున్నారని తీవ్రంగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎక్స్‌ చర్యలు చేపట్టింది. 3500 పోస్టులను బ్లాక్‌ చేయడంతో పాటు 600 అకౌంట్లను డిలీట్ చేసింది.

New Update
x blocked several posts

x blocked several posts

ఎక్స్‌(x) లో గ్రోక్‌(grok ai) ను వినియోగించి అశ్లీల కంటెంట్‌(Grok Obscene Images) క్రియేట్‌ చేస్తున్నారని తీవ్రంగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ కంటెంట్‌ను వెంటనే తొలగించాలని ఇప్పటికే కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఎక్స్‌ చర్యలు చేపట్టింది. 3500 పోస్టులను బ్లాక్‌ చేయడంతో పాటు 600 అకౌంట్లను డిలీట్ చేసింది.  తమ ప్లాట్‌ఫామ్‌పై అసభ్యకర కంటెంట్‌కు తావివ్వమని.. ప్రభుత్వ రూల్స్‌ను పాటిస్తామని హామీ ఇచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. గత కొన్నిరోజులుగా ఎక్స్‌లో గ్రోక్‌ సాయంతో ఇటీవల కొందరు అసభ్యకర చిత్రాలు సృష్టిస్తున్నారు.

Also Read: శవాలు కొనే కశ్మీర్‌ ముస్లీం.. అయోధ్య రామమందిరంలో నమాజ్

X Blocked Some Accounts Over Grok Obscene Images

ముఖ్యంగా మహిళల ఫొటోలను మార్ఫింగ్ చేయడం దుమారం రేపింది. ప్రపంచవ్యాప్తంగా దీనిపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇలాంటి అసభ్యకర పోస్టులను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అసభ్యకర కంటెంట్‌కు సంబంధించి ఫిర్యాదులు వస్తే ఆయా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లే బాధ్యత వహించాలని హెచ్చరించింది. - Social Media

Also Read: దారుణం.. 19ఏళ్ల యువతిపై పోలీస్ డ్రైవరే సామూహిక అత్యాచారం

ఆ తర్వాత ఎక్స్‌ సంస్థ తమ ఏఐ టూల్‌ అయిన గ్రోక్‌లో ఇమేజ్ జనరేషన్‌ ఫీచర్‌పై పరిమితులు కూడా విధించింది. ఈ ఫీచర్‌ను కేవలం ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంచింది. ఎక్స్‌కు డబ్బులు చెల్లించేవారు మాత్రమే ఈ ఫీచర్‌ను వినియోగించేలా చర్యలు తీసుకుంది. అంతేకాదు తమ ప్లాట్‌పామ్‌పై పోస్టు చేసిన చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను పూర్తిగా తొలగిస్తున్నామని తెలిపింది. వీటిని అప్‌లోడ్‌ చేసిన అకౌంట్లను కూడా డిలీట్ చేస్తామని పేర్కొంది. ఇందులో భాగంగానే ఏకంగా 600 అకౌంట్లను డిలీట్ చేసింది. 

Advertisment
తాజా కథనాలు