/rtv/media/media_files/2026/01/11/expelled-congress-mla-rahul-mamkootathil-arrested-in-fresh-rape-case-2026-01-11-12-54-32.jpg)
Expelled Congress MLA Rahul Mamkootathil arrested in fresh rape case
కేరళ(kerala) ఎమ్మెల్యే రాహుల్ మామ్‌కుటత్తిల్‌కు బిగ్ షాక్ తగిలింది. అత్యాచార ఆరోపణల నేపథ్యంలో ఆయన్ని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. పాలక్కాడ్‌లోని ఓ హోట్‌ల్‌లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాహుల్ మామ్‌కుటత్తిల్(MLA Rahul Mamkootathil) తమను లైంగికంగా వేధిస్తున్నాడని ఓ నటి, మరో యువతి గతంలో అతడిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు అత్యాచార కేసులు నమోదు చేయగా.. వాటిలో రాహుల్ ముందస్తు బెయిల్ పొందారు.
Also Read: గ్రోక్‌తో అసభ్యకర కంటెంట్.. 600 ఖాతాలు డిలీట్ చేసిన ఎక్స్
Expelled Congress MLA Rahul Mamkootathil Arrested
ఇటీవల మరో యువతి కూడా అతడిపై ఆరోపణలు చేసింది. రాహుల్ తనపై అత్యాచారం(rape-case) చేశాడని ఆ తర్వాత తాను గర్భం తొలగించుకోవాలంటూ బెదిరించాడని ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మానసికంగా, శారీరకంగా వేధించినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. రాజకీయ అతడికి పలుకుబడి ఉండటంతో పోలీసులకు ఇన్నిరోజులు ఫిర్యాదు చేయలేకపోయాయని తెలిపింది. ప్రస్తుతం రాహుల్‌పై రేపు కేసులు నమోదుకావడంతో తాను కూడా ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది.
Also Read: జేడీ లక్ష్మీనారాయణ భార్యకు సైబర్ నేరగాళ్ల వల.. రూ.2.58 కోట్లు మాయం
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరారీలో ఉన్న రాహుల్ మామ్‌కుటత్తిల్‌ను పాలక్కాడ్‌లో అరెస్టు చేశారు. వరుసగా అతడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అతడిని బహిష్కరించింది.
Follow Us