Tollywood: మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట.. కీలక ఆదేశాలు!
జర్నలిస్ట్ పై దాడి కేసులో నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఊరట లభించింది. ముందస్తు బెయిల్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. నాలుగు వారాలకు కేసు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. తదుపరి విచారణ వరకు మోహన్ బాబు పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.