Kamal Haasan: కమల్ హాసన్ తల నరికేస్తా.. ఆ నటుడు సంచలన హెచ్చరిక

ఇటీవల కమల్‌ హాసన్ సనాతన ధర్మం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై తమిళ సీరియల్ నటుడు రవిచంద్రన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల్‌ హాసన్ తల నరికేస్తానంటూ బెదిరించాడు.

New Update
Kamal Haasan

Kamal Haasan

ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌(Kamal Haasan) కు బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఇటీవల కమల్‌ హాసన్ సనాతన ధర్మం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై తమిళ సీరియల్ నటుడు రవిచంద్రన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల్‌ హాసన్ తల నరికేస్తానంటూ బెదిరించాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ క్రమంలోనే రవిచంద్రన్‌పై కమల్‌ హాసన్‌ స్థాపించిన మక్కల్‌ నీది మయ్యం పార్టీ కార్యకర్తలు పోలీసులను ఆశ్రయించారు. రవిచంద్రన్(Ravi Chandran) చేసిన వ్యాఖ్యలు శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొన్నారు. వెంటనే అతడిపై కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు.    

Also Read :  మాస్ జాతర షురూ.. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్న రవితేజ టీజర్!

Kamal Haasan Receives Death Threat

ఇక వివరాల్లోకి వెళ్తే ఇటీవల అగరం ఫౌండేషన్ వేడుకలో కమల్ హాసన్ సనాతన ధర్మం గురించి మాట్లాడారు. సనాతన సిద్ధాంతాలను బ్రేక్‌ చేసే ఆయుధం విద్య అని అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీన్ని రవిచంద్రన్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే బీజేపీ శ్రేణులు, సనాతన ధర్మాన్ని పాటించేవారు కూడా ఆయనపై విమర్శలు చేశారు. రవిచంద్రన్.. కమల్‌ హాసన్ తల నరికేస్తానని బెదిరించడం సంచలనం రేపింది. సోషల్ మీడియాలో ఈ అంశంపై చర్చనీయాంశమవుతోంది. కొందరు కమల్‌ హాసన్ వ్యాఖ్యలను సమర్థిస్తుంటే మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

Also Read :  కూలీలో మరో సర్ ప్రైజ్.. యంగ్ రజనీకాంత్ గా స్టార్ హీరో!

ఇదిలాఉండగా ఇటీవల కమల్‌ హాసన్‌కు డీఎంకే పార్టీ రాజ్యసభ ఎంపీ సీటును కేటాయించిన సంగతి తెలిసిందే. గత లోక్‌సభ ఎన్నికల్లో DMKతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా కమల్‌ హాసన్‌కు ఈ సీటును కేటాయించారు. ఇటీవల ఆయన రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం కూడా చేసిన సంగతి తెలిసిందే. ఇక కమలహాసన్ ఓవైపు రాజకీయాల్లో కొనసాగుతూనే సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. 

Also Read :  Mouni Roy: పింక్ శారీలో మత్తెక్కిస్తున్న మౌని .. ఫొటోలు చూస్తే ఫిదా!

గతంలో కూడా తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయ్‌ నిధి స్టాలిన్ కూడా సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటి వైరస్ అని వ్యాఖ్యానించారు. అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలపై కూడా తీవ్రంగా విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ ఉదయ నిధి స్టాలిన్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తమిళనాడు(Tamilnadu) లో ఇలా సనాతన ధర్మంపై వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటం చర్చనీయాంశమవుతోంది.   

Also Read :  ఈసారి బిగ్ బాసే మారిపోయాడు.. ఫుల్ ట్విస్టులతో బిగ్ బాస్ కొత్త ప్రోమో !

rtv-news | national news in Telugu | latest-telugu-news | telugu-cinema-news | telugu-film-news

Advertisment
తాజా కథనాలు