/rtv/media/media_files/2025/02/15/TZuE8wCRjwBcb1wsufaV.jpg)
accident
Music Composer Dony Hazarika's Mother Died In Car Accident: ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్(Music Director), సింగర్ డోనీ హజారికా(Dony Hazarika) ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి హజారికా ముంబైలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆగస్టు 10న హజారికా ఆమె భర్తతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాంద్రా-వర్లీ సీ లింక్ రోడ్డుపై వారు వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. వారు కారును వెనుక నుంచి వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి లక్ష్మీ హజారికాకు తీవ్ర గాయాలవగా.. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ లాభం లేకపోయింది! చికిత్స పొందుతూ ఆమె మరణించారు. హజారికా భర్త స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Also Read : కూలీలో మరో సర్ ప్రైజ్.. యంగ్ రజనీకాంత్ గా స్టార్ హీరో!
Also Read:Nita Ambani Car: నీతా అంబానీతో ప్రపంచంలోనే అరుదైన ఆడి కారు.. దీని ధర అక్షరాలా 1,00,00,00,000!
బాలీవుడ్ చిత్రాలకు..
ఇదిలా ఉంటే.. డోనీ హజారికా బాలీవుడ్ చిత్రాలకు, వివిధ భాషల్లోని సినిమాలకు సంగీతాన్ని అందించారు. చిన్నతనం నుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకున్న ఆయన తన సొంత ఊరిలో సంగీతం నేర్చుకున్నారు. ముంబైకి వెళ్ళిన తర్వాత బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. చాలా మంది దర్శకులతో కలిసి పనిచేశారు.
ఆయన పాటల్లో మెలోడీ , ఆధునిక బీట్స్ కలయిక కనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన హిందీ సినిమాలకు అందించిన పాటలు చాలా పాపులర్ అయ్యాయి. డోనీ తన మాతృభాష అయిన అస్సామీ సంగీతాన్ని కాపాడడానికి ఎంతో కృషి సేవ చేశారు. అస్సామీ సంస్కృతిని, సంప్రదాయ సంగీతాన్ని బాలీవుడ్‌కు, దేశానికి పరిచయం చేయడంలో ఆయన పాత్ర చాలా ముఖ్యమైనది.
సినిమాలతో పాటు, ఆయన ఇండిపెండెంట్ మ్యూజిక్ ఆల్బమ్స్ , యాడ్ ఫిలిమ్స్‌కు కూడా మ్యూజిక్ అందించారు. ఆయన స్వరపరిచిన పాటలు చాలా ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా హిందీలో ఆయన చేసిన కొన్ని పాటలు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సంపాదించాయి. ప్రస్తుతం ఆయన బాలీవుడ్‌లో బిజీగా ఉన్నారు. ఆయన సంగీత ప్రయాణం అస్సాం నుంచి ప్రారంభమై, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
Also Read: రజనీకేనా విషెస్.. ఎన్టీఆర్‌కు లేవా.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ!