Vijay Devarakonda: సుకుమార్‌తో మూవీపై విజయ్ దేవరకొండ అదిరిపోయే అప్డేట్.. ఇక రచ్చ రచ్చే

'కింగ్డమ్' సినిమా విజయంపై విజయ్ దేవరకొండ ఒక ఇంటర్వ్యూలో ఆనందం వ్యక్తం చేశారు. ఆపై సుకుమార్‌తో మూవీ గురించి మాట్లాడారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమా చేస్తున్నప్పటి నుంచే తాను సుకుమార్‌ కలిసి ఒక సినిమా చేయాలని అనుకున్నామని తెలిపారు. త్వరలో డిసైడవుతామన్నారు. 

New Update
Vijay Devarakonda sensational comments her next movie with director sukumar

Vijay Devarakonda sensational comments her next movie with director sukumar

విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్డమ్’ మూవీ జూలై 31న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ షో నుంచి మిక్స్డ్ టాక్ అందుకుంది. సినిమా ఫస్ట్ హాఫ్ బాగుందని ప్రేక్షకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇందులో విజయ్ దేవరకొండ తన కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని అంటున్నారు. 

అలాగే యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్లలోనూ విజయ్ తన యాక్టింగ్‌తో చించేశాడని అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. అలాగే సత్యదేవ్ పాత్ర కూడా సినిమాకి మరింత బలంగా ఉందని చెప్పారు. మూవీలో అన్నదమ్ముల సెంటిమెంట్‌ పండించడంలో విజయ్, సత్యదేవ్ సక్సెస్ అయ్యారని తెలిపారు.

ఇక ఈ సినిమాకి అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన బలం అని చెబుతున్నారు. అలాగే దర్శకుడు తన కథను భావోద్వేగంతో నడించడంలో సక్సెస్ అయ్యాడని తెలిపారు. అయితే ఫస్ట్ హాఫ్ సూపర్‌గా ఉన్నా.. సెకండ్ హాఫ్ మాత్రం చాలా స్లో నెరేషన్‌తో ఉందని అంటున్నారు. కొన్ని సీన్లు ల్యాగ్ చేశారని తెలిపారు. కథ కూడా రొటీన్‌గా ఉండటంతో పెద్దగా ఎక్కలేదని చెబుతున్నారు. 

Also Read :  రజినీ కాంత్ రచ్చ రచ్చ.. 'కూలీ' ట్రైలర్ వచ్చేసింది!

విజయ్ నెక్స్ట్ లైనప్

ఇలా మొత్తంగా ఈ మూవీ మిక్స్డ్‌ టాక్‌తో ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే ఈ మూవీ రిలీజ్ అనంతరం చిత్రబృందం హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించింది. ఈ మేరకు విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ మూవీల లైనప్‌ను తెలిపారు. తాను ఏం చేసినా ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమా అందించడమే తన ముఖ్య లక్ష్యం అన్నారు. తన నెక్స్ట్ మూవీ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో చేస్తున్నానని తెలిపారు. ఈ మూవీ రాయలసీమ నేపథ్యంలో సాగుతుందని.. అందువల్ల తాను సీమ యాస నేర్చుకుంటున్నానని తెలిపారు. 

అలాగే ఈ మూవీతో పాటు రవికిరణ్ కోలా దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నట్లు చెప్పారు. అది ఆంధ్రా నేపథ్యంలో సాగుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా సుకుమార్‌తో సినిమాపై స్పందించారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమా చేస్తున్నప్పటి నుంచే తాను సుకుమార్‌ కలిసి ఒక సినిమా చేయాలని అనుకున్నామని తెలిపారు. 

కాగా ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకోవడంపై మాట్లాడారు. ఆ సమయంలో తాను ఎంతో గర్వంగా ఫీలైనట్లు తెలిపారు. ఆ సమయంలో మూవీ ఆడియో ఈవెంట్‌కు వేలమంది అభిమానులు రావడం చూసి వారికి ఏదైనా చేయాలనిపించిందని తెలిపారు. తనకు వచ్చిన అవార్డును వేలం వేస్తే రూ.25 లక్షలు వచ్చాయని.. వాటిని కొన్ని మంచి పనుల కోసం ఉపయోగించానని తెలిపారు.

Also Read :  అబ్బా! అనసూయ చీరలో ఎంత అందంగా ఉందో.. ఒక్కసారి ఫొటోలపై లుక్కేయండి

Arjun Reddy | latest-telugu-news | telugu-cinema-news | telugu-film-news

Advertisment
తాజా కథనాలు