Shanavas: ప్రముఖ నటుడు కన్నుమూత!

ప్రముఖ మలయాళ నటుడు, సూపర్ స్టార్ ప్రేమ్ నజీర్ కుమారుడు షానవాస్ 71 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. షానవాస్ 50 కి పైగా చిత్రాలు, పలు టీవీ సీరియల్స్ లో నటించారు. 

New Update
BREAKING NEWS

BREAKING NEWS

ప్రముఖ మలయాళ నటుడు ప్రేమ్ నజీర్ కుమారుడు నటుడు షానవాస్ 71 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన మృతి పట్ల తీవ్ర దిద్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.  షానవాస్ మృతితో మలయాళ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

Also Read :  మృణాల్‌‌తో ధనుష్‌ డేటింగ్.. ఈ వీడియోతో మొత్తం బయటపడింది..!

100 కి పైగా చిత్రాలు

ఇదిలా ఉంటే షానవాస్ 1981లో తన యాక్టింగ్ కెరీర్ మొదలు పెట్టారు. 'ప్రేమగీతంగళ్' సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత  మలయాళం, తమిళ్లో దాదాపు 100కి పైగా చిత్రాల్లో నటించారు. హీరోగా, విలన్ గా, సహాయ పాత్రలలో నటించి తన బహుముఖ నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. సినిమాలు మాత్రమే కాదు బుల్లితెర పై కూడా తన నటనను ప్రదర్శించారు. 'శంఖుముఖం', 'వేలుత్తా కథ్రీనా', 'కడమతతు కథనార్'  వంటి టెలివిజన్ సీరియల్స్ ద్వారా బుల్లితెర ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యారు. 'మౌనరాగం', 'చైనా టౌన్' వంటి సినిమాకు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి.  షానవాస్ చివరిగా  పృథ్వీరాజ్ సుకుమారన్ 'జనగణమణ' సినిమాలో నటించారు.  షానవాస్ తండ్రి, ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ ప్రేమ్ నజీర్ తో కలిసి ఏడు సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. 

షానవాస్ వ్యక్తిగత జీవితం

షానవాస్ తిరువనంతపురంలో ప్రేమ్ నజీర్- హబీబా బీవీ దంపతులకు 1955 లో జన్మించారు. ఆయన స్కూలింగ్ చిరాయిన్ కీజు ఇంగ్లీష్ మీడియం స్కూల్, యెర్కాడ్ లోని మాంట్ఫోర్ట్ స్కూల్ లో జరిగింది. ఆ తర్వాత చెన్నైలోని న్యూ కాలేజీలో ఇంగ్లీష్ లిటరేచర్ లో మాస్టర్స్ పూర్తి చేసి డిగ్రీ పొందారు. షానవాస్ కి ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు. ఆయన భార్య పేరు ఆయేషా. షానవాస్- అయేషా దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒక కుమారుడు షామిర్ ఖాన్ మలయాళ సినిమాలో తన లక్కు పరీక్షించుకొని విఫలమయ్యాడు. 'ఉప్పుకందం బ్రదర్స్: బ్యాక్ ఇన్ యాక్షన్' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈ సినిమా ద్వారా అతడికి ఆశించిన స్థాయిలో  గుర్తింపు రాలేదు. ప్రస్తుతం మలేషియాలో మేనేజర్ గా పనిచేయడంతో పాటు వ్లాగింగ్ కూడా చేస్తుంటాడు. మరో కొడుకు అజిత్ ఖాన్ ఆస్ట్రేలియాలో పనిచేస్తున్నాడు. ఎన్నో సినిమాలు, టీవీ సీరియల్స్ తో అలరించిన షానవాస్ ఆగస్టు  1, 2025 లో కన్నుమూశారు. ఆయన మృతి మలయాళ సినీ ఇండస్ట్రీకి తీరని లోటు. 

Also Read:  సినిమా రివ్యూల పై నిప్పులు చెరిగిన మృణాల్ ఠాకూర్! ఫ్యాన్ తో చిట్ చాట్ వైరల్

malayalam-industry | Actor Shanavas | latest-telugu-news | telugu-cinema-news | telugu-film-news

Advertisment
తాజా కథనాలు