Raksha Bandhan: రాఖీ స్పెషల్.. నిహారికకు రామ్ చరణ్ ఊహించని గిఫ్ట్.. కాస్ట్ తెలిస్తే షాకే!

మెగా డాటర్ నిహారిక తన అన్నయ్యలు వరుణ్ తేజ్, రామ్ చరణ్ కి రాఖీ కట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను నిహారిక తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ రాఖీని నేను ఇంకొంచెం ఎక్కువగా ఇష్టపడుతున్నాను! నేను మీ చెల్లిని కావడం నా అదృష్టం అంటూ పోస్ట్ పెట్టింది.

New Update
celebrities rakhi festival

celebrities rakhi festival

తోబుట్టువుల అనుబంధానికి ప్రతీకగా  ప్రతి ఏడాది శ్రావణ మాసం(Sravana Masam) లో వచ్చే పౌర్ణమి రోజున రాఖీ పండుగను జరుపుకుంటారు. 'రక్షాబంధన్' పండుగ అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని మరింత దృఢంగా చేస్తోంది. ఈరోజు రాఖీ పండగ(Raksha Bandhan) సందర్భంగా దేశమంతా రాఖీ వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. మహిళలు తమ సోదరుల క్షేమం, సుఖసంతోషాలను కాంక్షిస్తూ వారికి రాఖీలు కడుతున్నారు. సెలబ్రిటీలు కూడా తమ తోబుట్టువులకు రాఖీలు కట్టి.. వారి అశీసులు తీసుకున్నారు. మెగా డాటర్ నిహారిక, రాశీ ఖన్నా, రణ్ బీర్ కపూర్, సోనూ సూద్ పలువురు సెలెబ్రెటీలు తమ రక్షాబంధన్ వేడుకకు సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. 

rakhi five

రామ్ చరణ్ భారీ గిఫ్ట్

మెగా డాటర్ నిహారిక తన అన్నయ్యలు వరుణ్ తేజ్, రామ్ చరణ్ కి రాఖీ కట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను నిహారిక తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ రాఖీని నేను ఇంకొంచెం ఎక్కువగా ఇష్టపడుతున్నాను! నా వన్ స్టాప్ సొల్యూషన్ @varunkonidela7 @alwaysramcharan నేను మీ చెల్లిని కావడం నా అదృష్టం అంటూ పోస్ట్ పెట్టింది. ఇదిలా ఉంటే రాఖీ సందర్భంగా రామ్ చరణ్ నిహారికకు భారీ గిఫ్ట్ ప్రజెంట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రతి ఏడాది నిహారిక రామ్ చరణ్, వరుణ్ కి రాఖీ కట్టిన వీడియోలను, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. 

rakhi four

Also Read :  జాన్వీ వెరీహాట్.. వాన జల్లులో 'పరమ్ సుందరి' రొమాన్స్! సాంగ్ చూశారా

రణబీర్ కపూర్ 

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ సోదరి రిద్ధిమా కపూర్  తన  సోదరుడికి రాఖీ కట్టిన ఫొటోను పంచుకున్నారు. రణబీర్ఇం, రిద్ధిమా ఇద్దరు పింక్ కలర్ మ్యాచింగ్ మ్యాచింగ్ కాస్ట్యూమ్స్ ధరించి సిబ్లింగ్ వైబ్స్ అందించారు. ఈ ఫొటోతో పాటు రిద్ధిమా 'రాఖీ శుభాకాంక్షలు' శుభాకాంక్షలు తెలిపింది. 

rakhi one

సంజయ్ దత్ అండ్ సోనూసూద్ 

సంజయ్ దత్ అండ్ సోనూసూద్  కూడా తమ తోబుట్టువులకు ఇన్‌స్టాగ్రామ్‌లో రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రియా,  అంజు మీరు సోదరీమణులుగా ఉండడం నాకు జీవితం ఇచ్చిన అతిపెద్ద వరం! నా జీవితాన్ని ప్రేమ, ఆనందంతో నింపినందుకు ధన్యవాదాలు అంటూ పెట్టారు దత్.  అలాగే సోనూ సుద్  కూడా తన చెల్లెళ్ళ కోసం ఒక నోట్ రాశారు.  "హ్యాపీ రాఖీ, మోనా భాజీ & మాల్విక..  మాటల్లో  చెప్పలేనంతగా మీ ఇద్దరినీ ప్రేమిస్తున్నాను అంటూ  పోస్ట్ పెట్టారు. 

rakhi five

రాశీ ఖన్నా 

నటి రాశీ ఖన్నా రక్షాబంధన్ సందర్భంగా తన అన్నతో ఉన్న కొన్ని మధురమైన జ్ఞాపకాలను పంచుకుంది. అలాగే అన్నకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసింది. ''పెయింట్‌బాల్ యుద్ధాల నుంచి మ్యాగీ  చర్చల వరకు, ఎల్లప్పుడూ నా ప్రొటెక్టర్, నా స్నేహితుడు అన్నయ్యకు రాఖీ శుభాకాంక్షలు'' అంటూ పోస్ట్ పెట్టింది రాశీ. 

rakhi two

అల్లు అర్హ రాఖీ సెలబ్రేషన్స్ 

అల్లు అర్జున్ కూతురు అర్హ రాఖీ సెలబ్రేషన్స్ వీడియోను ఆమె తల్లి అల్లు స్నేహారెడ్డి ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. అర్హ అన్న అయాన్ కి రాఖీ కట్టి.. ఆశీర్వాదం తీసుకుంది.  ఇదిలా ఉంటే అర్హ తన ముద్దుముద్దు మాటలు, క్యూట్ వీడియోలతో  సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటుంది. 

Also Read: Mahesh Babu Globe Trotter: ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య.. బుల్లెట్ దిగిందా లేదా..!? పండుగాడి దెబ్బకు ఇండస్ట్రీ షేక్..!

Advertisment
తాజా కథనాలు