/rtv/media/media_files/2025/08/13/rajinikanth-wife-latha-rajinikanth-2025-08-13-18-32-39.jpg)
Rajinikanth wife Latha Rajinikanth
సూపర్ స్టార్ రజినీకాంత్ - లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) కాంబినేషన్లో తెరకెక్కిన 'కూలీ' మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదలకు ముందే ఈ సినిమా ప్రీమియర్ షో వీక్షించిన రజినీకాంత్ భార్య మూవీపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు తలైవా అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచాయి. కూలీ రజినీకాంత్ కెరీర్ లోనే అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచిపోతుందని అన్నారు. అలాగే అభిమానుల మదిలో చాలా కాలం పాటు ఉండిపోతుందని తన రివ్యూను పంచుకున్నారు. సినిమా విజువల్స్, కథ, కథనం ముఖ్యంగా రజినీ నటనను ఆమె ఎంతగానో మెచ్చుకున్నారు. తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా ''కూలీ'' పై తన రివ్యూను పంచుకున్నారు. కూలీ ఒక మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని అన్నారు. ఇది ప్రేక్షకుల మనసు దోచుకోవడం ఖాయమని కొనియాడారు.
BREAKING: #SuperstarRajinikanth with his wife #LathaRajinikanth is all set to watch #Jailer with UP CM #YogiAdityanath Ji in Lucknow at 3 PM ❤️🔥#JailerIndustryHit#JailerBlockbusterpic.twitter.com/pugIxPzq3y
— Sarvajit Krishna Mohan (@SarvajitKM) August 19, 2023
అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్ ..
ఇదిలా ఉంటే 'కూలీ'(Coolie Movie) అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. ఇండియాలోనే కాకుండా ఓవర్ సీస్ లోనూ జోరు చూపిస్తోంది. కేవలం తమిళనాడులోనే రూ. 27 కోట్లకు పైగా అడ్వాన్స్ జరగగా.. దేశవ్యాప్తంగా రూ. 53 కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగినట్లు సమాచారం. ఇక ఓవర్సీస్‌లో రూ.35 కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ. 80 కోట్లుకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో విడుదలకు ముందే రూ. 100 కోట్ల మార్క్ ని దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.
Also Read:War2 Pre Release Event: ఎవ్వడేం చేయలేడు.. ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ఎన్టీఆర్ స్పీచ్ వీడియో!
నార్త్ అమెరికాలో $2 మిలియన్ ప్రీమియర్ ప్రీ-సేల్స్ మార్కును దాటిన తొలి తమిళ సినిమాగా 'కూలీ' రికార్డు సృష్టించింది. రజనీకాంత్(Rajinikanth) గతంలో వచ్చిన 'కబాలి' రికార్డును ఈ సినిమా బద్దలు కొట్టింది. కూలీ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే.. రజినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉంది.
గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్, సత్యరాజ్, నాగార్జున, శ్రుతి హాసన్, సౌబిన్ సాహిర్, ఉపేంద్ర వంటి స్టార్ కాస్ట్ నటించారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించడం ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ పై తమిళ ఫ్యాన్స్ తో పాటు తెలుగు అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. రజినీ కెరీర్ లో 'కూలీ' ఒక మైలురాయిగా నిలవనుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. రజినీకాంత్ గత సినిమాలు 'వేట్టయాన్', 'లాల్ సలాం' ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో సూపర్ స్టార్ అభిమానులన్నీ 'కూలీ' పైనే ఉన్నాయి.
Also Read: అమెరికాలో 'కూలీ' ఊచకోత! విడుదలకు ముందే అన్ని కోట్ల వసూళ్లు చేసిన తొలి తమిళ్ సినిమా!