G2 Release Date: అడివి శేష్ ‘G2’ రిలీజ్ డేట్ ఖరారు.. పవర్‌ఫుల్ పోస్టర్ చూశారా?

అడివి శేష్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'G2' విడుదల తేదీ ఖరారైంది. ఈ స్పై థ్రిల్లర్ 2026 మే 1న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కానుంది. వినయ్ కుమార్ సిరిగానేడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు.

New Update
G2 movie Release Date announced by actor adivi sesh

G2 movie Release Date announced by actor adivi sesh

అడివి శేష్ నటించిన ‘గూఢచారి’ చిత్రం గతంలో ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాక్సాఫీసు వద్ద భారీగా కలెక్షన్ల వర్షం కురిపించింది. శోభిత ధూళిపాల, సుప్రియ యార్లగడ్డ, ప్రకాష్ రాజ్ లాంటి ప్రముఖ నటుల అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ సినిమా అభిమానులను, సినీ ప్రియులను అట్రాక్ట్ చేసింది. దీనికి తోడు అడివి శేష్ అందించిన కథ, స్క్రీన్‌ప్లే సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాయి. 

G2 movie Release Date 

గూఢచారి చిత్రానికి వచ్చిన టాక్ చాలా సానుకూలంగా ఉంది. ఈ సినిమా ఒక అద్భుతమైన స్పై థ్రిల్లర్‌గా అందరి నుంచి ప్రశంసలు అందుకుంది. హాలీవుడ్ స్థాయి యాక్షన్ సన్నివేశాలు, ఊహించని ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమా నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ కూడా ప్రేక్షకులను మెప్పించాయి. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టి, విజయవంతమైన చిత్రంగా నిలిచింది. 

ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘G2’ పేరుతో మరొక కొత్త ప్రాజెక్ట్ రూపొందుతోంది. మొదటి సినిమాలో లాగే ఈ సినిమాలో కూడా అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తూ, కథను అందించారు. ఈ సారి ఈ సీక్వెల్ చిత్రానికి దర్శకుడు మారాడు. ‘మేజర్’ చిత్రానికి ఎడిటర్‌గా పనిచేసిన వినయ్ కుమార్ సిరిగానేడి.. ఇప్పుడు ‘G2’ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. 

ఈ సినిమాలో ప్రధాన హీరోయిన్‌గా వామికా గబ్బి నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించబోతున్నాడు. అలాగే ఫస్ట్ పార్ట్‌లో నటించిన సుప్రియ యార్లగడ్డ, శోభిత ధూళిపాల, మధు శాలిని వంటి నటీనటులు ఈ సీక్వెల్‌లో కూడా కొనసాగుతున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, AK ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుమారు రూ.100 కోట్లతో బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతున్నట్లు సమాచారం. 

తాజాగా నటుడు అడివి శేష్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ, సరికొత్త ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సినిమా 2026 మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని తెలిపారు. ఈ స్పై థ్రిల్లర్ తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల కానుందని వెల్లడించారు. దీంతో అభిమానులు, ప్రేక్షకులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ‘గూఢచారి’ తర్వాత అంతర్జాతీయ స్థాయి యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ‘G2’ కోసం అడివి శేష్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ చిత్రం 6 దేశాల్లో.. 23 సెట్లలో.. 150 రోజులకు పైగా షూటింగ్ జరిగిందని అడివిశేష్ తెలిపారు. 

Advertisment
తాజా కథనాలు