Huma Qureshi : ఢిల్లీలో దారుణం..  నటి హుమా ఖురేషి సోదరుడు హత్య!

దేశరాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. బాలీవుడ్ నటి హుమా ఖురేషికి చెందిన కజిన్ సోదరుడు ఆసిఫ్ ఖురేషి నిజాముద్దీన్ ప్రాంతంలో దారుణ  హత్యకు గురయ్యారు. ఘటనకు కారణం పార్కింగ్ స్థలం విషయంలో జరిగిన గొడవేనని తెలుస్తోంది.

New Update
murder

దేశరాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. బాలీవుడ్ నటి హుమా ఖురేషి(Huma Qureshi) కి చెందిన కజిన్ సోదరుడు ఆసిఫ్ ఖురేషి(Asif Qureshi) నిజాముద్దీన్ ప్రాంతంలో దారుణ  హత్యకు గురయ్యారు. ఘటనకు కారణం పార్కింగ్ స్థలం విషయంలో జరిగిన గొడవేనని తెలుస్తోంది.  గురువారం రాత్రి 11 గంటల సమయంలో నిజాముద్దీన్ ఏరియా, జంగ్‌పురా భోగల్ లేన్‌లో ఈ ఘటన జరిగినట్లుగా సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆసిఫ్ తన ఇంటి ముందు గేటు వద్ద పార్క్ చేసిన ఒక స్కూటర్‌ను తీసేయమని ఇద్దరు వ్యక్తులతో గొడవపడ్డారు.

ఈ వాగ్వాదం పెరిగి, ఆ ఇద్దరు వ్యక్తులు ఆసిఫ్‌పై పదునైన ఆయుధంతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఆసిఫ్‌ను ఆసుపత్రికి తరలించగా, అక్కడ అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే ఈ హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆసిఫ్ భార్య, బంధువులు నిందితులు ఒక చిన్న విషయం కారణంగా అతనిపై కనికరం లేకుండా దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై  సైనాజ్ ఖురేషి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు గతంలో ఇదే పార్కింగ్ విషయంలో తనతో గొడవ పడ్డాడని ఆమె చెప్పింది.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది. 

Also Read :  బాలీవుడ్ లో బిజీ అవుతున్న టాలీవుడ్ బ్యూటీ.. రాశీ పిక్స్ చూశారా!

గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ తో గుర్తింపు

హుమా ఖురేషి ఒక ప్రముఖ భారతీయ నటి, మోడల్. ఆమె ప్రధానంగా హిందీ సినిమాల్లో నటించారు, కానీ తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో కూడా సినిమాలు చేశారు. గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ (2012) అనే సినిమాతో ఆమె నటిగా గుర్తింపు పొందారు. ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. రజనీకాంత్ తో కలిసి నటించిన కాలా చిత్రం ఆమెకు మంచి పేరు తెచ్చింది.  హాలీవుడ్ చిత్రం ఆర్మీ ఆఫ్ ది డెడ్ (Army of the Dead)లో కూడా ఆమె నటించారు. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో రక్షాబంధన్ స్పెషల్ ఎపిసోడ్‌లో తన సోదరుడు సాకిబ్ సలీమ్‌తో కలిసి ఆమె కనిపించనున్నారు ఆమె రాబోయే ప్రాజెక్టులలో జాలీ ఎల్‌ఎల్‌బి 3, మాలిక్ వంటి చిత్రాలు ఉన్నాయి. ఇటీవల ఆమె నటిస్తున్న బయాన్ చిత్రం టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ (TIFF) 2025కు ఎంపికైంది.

Also Read :  అయ్యో.. అల్లు అర్హ మంచు లక్ష్మిని అలా అనేసిందేంటి! ఫుల్ నవ్వేసిన అల్లు అర్జున్!

Advertisment
తాజా కథనాలు