43rd India Day Parade New York: విజయ్, రష్మికకు అరుదైన గౌరవం.. ఇండియా డే పరేడ్‌లో సందడి!

అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగే 43వ వార్షిక ఇండియా డే పరేడ్ వేడుకల్లో ప్రముఖ టాలీవుడ్ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక  సందడి చేయనున్నారు. ఈ పరేడ్ కి కో-గ్రాండ్ మార్షల్‌లుగా వ్యవహరించనున్నారు.

New Update
vijay- rashmika

vijay- rashmika

43rd India Day Parade New York: అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగే 43వ వార్షిక ఇండియా డే పరేడ్ వేడుక(43rd India Day Parade New York) ల్లో ప్రముఖ టాలీవుడ్ నటులు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక(actress-rashmika-mandanna)  సందడి చేయనున్నారు. ఈ పరేడ్ కి కో-గ్రాండ్ మార్షల్‌లుగా వ్యవహరించనున్నారు. ఆగస్టు 17న న్యూ యార్క్  మాడిసన్ అవెన్యూ  వేదికగా "సర్వే భవంతు సుఖినః" అనే థీమ్‌తో ఈ వేడుకలు  నిర్వహించనున్నారు. శాంతి, సౌభ్రాతృత్వాన్ని కోరుతూ ఈ థీమ్‌ను ఎంచుకున్నట్లు ఎఫ్‌ఐఏ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్) అధ్యక్షుడు సౌరిన్ పారిఖ్ తెలిపారు. విదేశాల్లో భారత్ ప్రతిష్టను పెంచే కృషిగా ఈ పరేడ్ వేడుకలను నిర్వహిస్తారు. 

ఈ సందర్భంగా భారత కాన్సుల్ జనరల్ బినయ ఎస్. ప్రధాన్ మాట్లాడుతూ..  "అరవ శతాబ్దం నుంచి ఎఫ్‌ఐఏ అమెరికాలో భారత్ ప్రతిష్ఠను పెంచేందుకు కృషి చేస్తోంది. 1981లో ఒక చిన్న పరేడ్‌గా మొదలైన ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఇండియా డే వేడుకగా పేరుగాంచింది" అని  ఆనందం వ్యక్తం చేశారు. 1970లో స్థాపించబడిన ఎఫ్‌ఐఏ, భారతీయ సంస్కృతిని ప్రోత్సహిస్తూ, అమెరికా-భారత్ సంబంధాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది. 

 ఎఫ్‌ఐఏ  ఈ ఏడాది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అనేక కార్యక్రమాలను రూపొందించారు.  విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఆరు భాషల్లో (హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్) ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని పంపారు. 

Also Read :  రూ. 200 కోట్లతో నరసింహ గర్జన.. యానిమేషన్ చరిత్రలో కొత్త రికార్డు!

మూడు రోజుల వేడుకలు ఇవే

  • ఆగస్టు 15న: పరేడ్‌కు ముందు శుక్రవారం రోజున వేడుకలు ప్రారంభమవుతాయి. ఎంపైర్ స్టేట్ భవనంపై త్రివర్ణ పతాక కాంతులు ప్రసరిస్తాయి.
  • ఆగస్టు 16న: శనివారం రోజున టైమ్స్ స్క్వేర్‌లో భారత జెండా ఎగురవేసే కార్యక్రమం జరుగుతుంది.  ఆ తర్వాత  ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. పరేడ్ వేడుకల్లో క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం ఇదే మొదటిసారి. 
  • ఆగస్టు 17న: ఆదివారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు మాడిసన్ అవెన్యూలో ప్రధాన ఇండియా డే పరేడ్ మొదలవుతుంది. ఈ పరేడ్‌లో ఐఎస్‌కేఓఎన్ ఆధ్వర్యంలో రథయాత్ర కూడా జరుగుతుంది. పరేడ్ తర్వాత సిప్రియానీ వాల్ స్ట్రీట్‌లో గ్రాండ్ గాలా కార్యక్రమం ఉంటుంది.

ఎఫ్‌ఐఏ ఛైర్మన్ అంకుర్ వైద్య మాట్లాడుతూ, "ఈ పరేడ్ లాజిస్టిక్స్ అన్నీ వాలంటీర్ల సహాయంతో జరుగుతాయి. ఇది డబ్బుతో కూడుకున్నది కాదు, ఇది దేశంపై ఉన్న అభిమానంతో పాల్గొనే వేడుక" అని అన్నారు. ఈ పరేడ్‌కు గ్రాండ్ మార్షల్‌గా హాజరు కావడం విజయ్, రష్మికకు లభించిన ఒక గొప్ప గౌరవంగా చెప్పవచ్చు అని తెలిపారు. 

Also Read: రజనీకేనా విషెస్‌.. ఎన్టీఆర్‌కు లేవా.. సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ!

Advertisment
తాజా కథనాలు