Vijay Deverakonda : హీరో విజయ్‌ దేవరకొండకు బ్యాడ్ టైం...  థియేటర్లు ఖాళీ!

హీరో విజయ్‌ దేవరకొండకు బ్యాడ్ టైం నడుస్తోంది.  వరుస ఫ్లాప్‌లతో సతమతం అవుతున్న విజయ్‌ తాజాగా కింగ్ డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం  మిక్సుడ్ టాక్ సొంతం చేసుకుంది.

New Update
kingdom

హీరో విజయ్‌ దేవరకొండకు బ్యాడ్ టైం నడుస్తోంది.  విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఇటీవల వరుసగా ప్లాపులు ఎదుర్కొన్నారనే విషయం నిజమే. 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' లాంటి బ్లాక్‌బస్టర్ల తర్వాత ఆయన నటించిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. లైగర్ పాన్-ఇండియా స్థాయిలో విడుదలైనప్పటికీ, చాలా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఫ్యామిలీ స్టార్ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నప్పటికీ, ఇది కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇలా వరుస ఫ్లాప్‌లతో సతమతం అవుతున్న విజయ్‌ తాజాగా కింగ్ డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం  మిక్సుడ్ టాక్ సొంతం చేసుకుంది.  గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ సినిమా సుమారు రూ. 100 కోట్లతో భారీ బడ్జెట్‌తో నిర్మించబడినట్లు సమాచారం. 

ఈ సినిమా ఆశించిన  స్థాయిలో లేకపోవడంతో  కలెక్షన్లు కూడా డ్రాప్ అయ్యాయి.  నిర్మాణ సంస్థ (సితార ఎంటర్‌టైన్‌మెంట్స్) అధికారికంగా విడుదల చేసిన పోస్టర్ ప్రకారం, మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 39 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.రెండో రోజు కలెక్షన్లలో కొంత తగ్గుదల కనిపించింది. ఇండియాలో రెండో రోజు నెట్ కలెక్షన్లు సుమారు రూ. 7.50 కోట్లుగా వచ్చాయి.   

మొదటి రోజు తెలుగు రాష్ట్రాల నుంచి రూ. 9.92 కోట్ల షేర్ (సుమారు రూ. 18 కోట్ల గ్రాస్) వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే వీకెండ్ లో మాత్రం కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. థియేటర్లన్నీ దాదాపుగా ఖాళీగా ఉన్నాయి.  ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 54 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రం హిట్ అనిపించుకోవాలంటే, సుమారు రూ. 56 కోట్ల షేర్ లేదా రూ. 112 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. 

Also Read :  సమంత ఎంగేజ్మెంట్..? రింగుతో ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ వైరల్!

తదుపరి సినిమాలు ఇవే!

విజయ్ దేవరకొండ తదుపరి సినిమాల విషయానికి వస్తే  కింగ్ డమ్ తర్వాత అద్భుతమైన ప్రొజెక్ట్‌లతో లైన్‌ అప్ అయ్యాయి.  ట్యాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ చిత్రాల దర్శకుడు రాహుల్ సంకృత్యాన్‌తో విజయ్ దేవరకొండ సినిమా చేయనున్నారు. ఇది ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. రాజావారు రాణివారు ఫేమ్ రవి కిరణ్ కోల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న SVC59 సినిమా కూడా లైనప్ లో ఉంది. ఇది ఒక రూరల్ యాక్షన్ మూవీ అని తెలుస్తోంది. గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్, కొంత కాలం ఆగిపోయింది. ఈ సినిమా మళ్ళీ తెరకెక్కే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' ఫ్రాంఛైజ్‌లో మూడవ భాగంలో విజయ్ దేవరకొండ అతిథి పాత్రలో కనిపించవచ్చని కొన్ని ఊహాగానాలు వచ్చాయి. దీనిపై కూడా ఇంకా అధికారిక సమాచారం లేదు.

Also Read :  ఇవాళ యూట్యూబ్ షేక్ అవ్వాల్సిందే..!

Vijay Devarakonda | Kingdom | 2025 Tollywood movies | latest tollywood updates | latest-telugu-news | telugu-film-news | telugu-cinema-news

Advertisment
తాజా కథనాలు