RCB విజయంతో తాగి ఊగేశారు భయ్యా.. ఏరులై పారిన బీర్లు!
18 ఏళ్ల నిరీక్షణ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా కర్ణాటకలో మంగళవారం మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి పెరిగాయి.
18 ఏళ్ల నిరీక్షణ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా కర్ణాటకలో మంగళవారం మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి పెరిగాయి.
భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వంశికను నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇవాళ లక్నోలో వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. కాగా వీరి వివాహ తేదీపై ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు.
దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నను కోహ్లీకి ఇవ్వాలని ఇండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా కోరారు. ఇండియన్ క్రికెట్‌కు కోహ్లీ చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుతో సత్కరించాలన్నారు. క్రీడల్లో ఫస్ట్ సచిన్ టెండూల్కర్‌కు ఈ అవార్డు ఇచ్చారు.
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి కేకేఆర్ జట్టు 206 పరుగులు చేసింది. దీంతో ఆర్ఆర్ ముందు 207 టార్గెట్ ఉంది.
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ కోల్ కతా vs రాజస్థాన్ రాయల్స్ మధ్య 53వ మ్యాచ్ రెడీ అయింది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన కేకేఆర్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్ఆర్ జట్టు బౌలింగ్ కు దిగనుంది.
ఐపీఎల్ 2025లో భాగంగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిన ఆర్సీబీ ఓ చెత్త రికార్డ్ ను మూటగట్టుకుంది. హోంగ్రౌండ్లో 46 మ్యాచులు ఓడిన జట్టుగా ఆర్సీబీ నిలిచింది. గతంతో ఈ రికార్డ్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పేరిట ఉండేది.
ఢిల్లీ బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్‌కు మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా పడింది. బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విషయం చెప్పేందుకు ఆటగాడిని పంపించగా మ్యాచ్ అధికారి అడ్డుకున్నాడు. దీంతో మునాఫ్ అతనితో వాగ్వాదానికి దిగడంతో జరిమానా విధించారట.
ఐపీఎల్ లో మొట్టమొదటిసారి సూపర్ ఓవర్ కు ఓ మ్యాచ్ దారి తీసింది. ఈరోజు జరిగిన ఢిల్లీ, రాజస్థాన్ మ్యాచ్ లో రెండు టీమ్ లు పోటీపోటీగా ఆడాయి. దీంట్లో సూపర్ ఓవర్ లో గెలిచి ఢిల్లీ విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో ఢిల్లీ గెలిచింది.
ఐపీఎల్ 2025లో మంచి ఊపు మీదున్న పంజాబ్ కింగ్స్ జట్టుకు ఊహించని దెబ్బ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్‌లకు దాదాపుగా దూరమయ్యాడని ఆ జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ వెల్లడించారు.