/rtv/media/media_files/2025/11/09/west-bengal-2025-11-09-07-11-22.jpg)
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(sourav-ganguly) పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశంసల జల్లు కురిపించారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధ్యక్ష పదవికి గంగూలీకి ఆమె మరోసారి గట్టి మద్దతు ప్రకటించారు. గంగూలీని ఐసీసీ అధినేతగా నియమించాలని, దాదా లాంటి అర్హతలున్న వ్యక్తిని ఆపడం ఎవరికీ సాధ్యం కాదన్నారు దీదీ.
BREAKING 🚨
— Ravinder Kapur. (@RavinderKapur2) November 8, 2025
West Bengal CM Mamata Banerjee backs former cricketer Sourav Ganguly.
She said, "He should have been the current ICC president" pic.twitter.com/Iga6AT6j5X
Also Read : డాక్టర్ లాకర్‌లో AK-47 రైఫిల్.. వెలుగులోకి సంచలన విషయాలు
ఈడెన్ గార్డెన్స్ వేదికగా శనివారం ప్రపంచ కప్ విజేత రిచా ఘోష్ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. సౌరవ్ గంగూలీ కేవలం ఒక ఆటగాడు మాత్రమే కాదని, బెంగాల్ కు గర్వకారణమని అన్నారు. ఆయన దేశానికి, ప్రపంచానికి, బెంగాల్‌కి అపారమైన సేవ అందించారని కొనియాడారు. తాము ఎప్పుడూ సౌరవ్‌ని చాలా కాలం కెప్టెన్‌గా చూడాలనుకున్నామని, ఇప్పుడు నా మాట వినండి... ఐసీసీ అధ్యక్షుడిగా ఎవరు ఉండాలి? సౌరవ్ గంగూలీ తప్ప మరొకరు కాదని అన్నారు. ఈరోజు గంగూలీ ఆ స్థానంలో లేకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే ఆయనను ఆపడం అంత సులభం కాదని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.
ఐసీసీ చైర్మన్ పదవిలో జై షా
2022లో బీసీసీఐ(bcci) అధ్యక్ష పదవి నుంచి గంగూలీని తప్పించిన సమయంలో కూడా మమతా బెనర్జీ బహిరంగంగా ఇలాంటే కామెంట్స్ చేశారు. ఆ సమయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, "అమిత్ షా కొడుకును బిసిసిఐలో ఎందుకు కొనసాగించారు" అని ప్రశ్నించారు. గంగూలీకి ఐసీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతివ్వాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి ఆమె అప్పట్లో విజ్ఞప్తి చేశారు. కాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ పదవిలో ఉన్నారు, ఆయన నాలుగు సంవత్సరాల బీసీసీఐ కార్యదర్శి పదవీకాలం పూర్తి చేసుకున్నారు. మూడేళ్ల పాటు బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ స్థానంలో రెండు సంవత్సరాల తర్వాత షా ఆ పదవికి పదోన్నతి పొందారు.
Also Read : IND Vs AUS: ఫైనల్ మ్యాచ్ రద్దు.. టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భారత్
Follow Us