/rtv/media/media_files/2025/11/20/ind-vs-sa-2nd-test-2025-11-20-19-15-37.jpg)
IND Vs SA 2nd test
భారత్, దక్షిణాఫ్రికా(ind vs sa test series 2025) మధ్య ప్రస్తుతం రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా ఇటీవల కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తొలి మ్యాచ్ జరగ్గా.. అందులో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లందరూ విఫలమయ్యారు. ఏ ఒక్క బ్యాట్సమన్ కూడా పెద్దగా రాణించలేకపోయారు.
Also Read : కెప్టెన్‌గా ఇషాన్ కిషన్.. క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం
IND Vs SA 2nd Test
ఓపెనర్ బ్యాటర్లతో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కూడా చేతులెత్తేశారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో విజయానికి కేవలం 124 టార్గెట్ ఉండగా.. వాటిని ఛేదించలేక భారత్ సతికిళ్లపడింది. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ గాయంతో దూరం కావడం జట్టుకు మరింత షాక్ తగిలింది. దీంతో టీం ఇండియా 0-1 తేడాతో వెనుకబడి ఉంది.
త్వరలో అంటే నవంబర్ 22 నుంచి సెకండ్ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇది గౌహతిలో జరగనుంది. ఈ రెండో టెస్ట్ ప్రారంభానికి ముందు భారత జట్టు ఆందోళనలో పడింది. మెడ గాయంతో కెప్టెన్ గిల్ జట్టుకు దూరమయ్యాడు. అందువల్ల అతడు సెకండ్ టెస్ట్‌లో పాల్గొనే ఛాన్స్ లేదు. అలాగే ఫస్ట్ టెస్ట్‌లో పెద్దగా పెర్ఫార్మ్ చేయని ప్లేయర్ల ప్లేస్‌లోకి కొత్త వారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనిబట్టి టీమిండియా ప్లేయింగ్ 11లో భారీగానే మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. - india-vs-south-africa
అందిన సమాచారం ప్రకారం.. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ రెండవ టెస్ట్ కోసం టీమ్ ఇండియా ప్లేయింగ్ 11లో భాగం కాలేడు. దీంతో తదుపరి కెప్టెన్‌గా రిషబ్ పంత్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. అదే సమయంలో గిల్ స్థానంలో సాయి సుదర్శన్‌ను తీసుకునే అవకాశం కనిపిస్తోంది. శుభ్‌మన్ గిల్‌తో పాటు అక్షర్ పటేల్‌ను కూడా రెండో టెస్ట్ కోసం ప్లేయింగ్ 11 నుండి తొలగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
దీంతో అక్షర్ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డిని జట్టు యాజమాన్యం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సెకండ్ టెస్ట్‌కు వాషింగ్టన్ సుందర్ కూడా దూరమయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. అప్పుడు సుందర్ స్థానంలో దేవదత్ పడిక్కల్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పడిక్కల్ నెట్స్‌లో విస్తృతంగా బ్యాటింగ్ చేస్తున్నట్లు కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కూడా అతనితో మాట్లాడుతున్నట్లు కనిపించింది. ఇలా టీమిండియా జట్టులో కొన్ని మార్పులు చేర్పులు జరిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
Also Read : IND Vs BAN: భారత్ vs బంగ్లా.. సెమీ-ఫైనల్ మ్యాచ్‌కు రెడీ
Follow Us