/rtv/media/media_files/2025/11/20/ishan-kishan-became-captain-of-jharkhand-2025-11-20-18-02-58.jpg)
ishan kishan became captain of jharkhand
టీమిండియా బ్యాటర్ ఇషాన్ కిషన్(ishan-kishan) అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. తాజాగా అతడు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఇషాన్ ఇండియా A తరఫున అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. మూడో మ్యాచ్‌లో 53 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించాడు.
Also Read : IND Vs BAN: భారత్ vs బంగ్లా.. సెమీ-ఫైనల్ మ్యాచ్‌కు రెడీ
Ishan Kishan
అతడి అద్భుతమైన ప్రదర్శనకు ఇప్పుడు ప్రతిఫలం దక్కింది. త్వరలో జరగనున్న సయ్యద్ ముష్తాక్ అలీ టోర్నమెంట్ 2025 కోసం జార్ఖండ్ క్రికెట్ బోర్డు ఇషాన్ కిషన్ ను కెప్టెన్‌గా సెలెక్ట్ చేసింది. ఈ టోర్నమెంట్ నవంబర్ 26న ప్రారంభం కానుంది. డిసెంబర్ 18న ఇండోర్‌లో చివరి మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్ జార్ఖండ్, ఢిల్లీ మధ్య జరగనున్నట్లు తెలుస్తోంది.
Ishan Kishan named as Jharkhand’s captain for Syed Mushtaq Ali Trophy. pic.twitter.com/gLzYWWtBYD
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 20, 2025
Also Read : టీమిండియాకు కొత్త కెప్టెన్.. సెకండ్ టెస్ట్‌కు గిల్ దూరం..!
దీంతో సయ్యద్ ముష్తాక్ అలీ టోర్నమెంట్ 2025లో ఇషాన్ కిషన్ జార్ఖండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ టోర్నమెంట్‌లో అద్భుతమైన ప్రదర్శన చేస్తే ఇషాన్ కిషన్‌కు భారత T20 జట్టు(t20-world-cup-trophy)లోకి తిరిగి రావడానికి ఒక సువర్ణావకాశం దక్కే అవకాశం ఉందనే చెప్పాలి. వచ్చే ఏడాది ప్రారంభంలో T20 ప్రపంచ కప్ భారతదేశంలో జరగనుంది. అందువల్ల త్వరలో జరగనున్న ఈ దేశీయ T20 టోర్నమెంట్(world-cup-t20)లో ఇషాన్ ఎక్కువ పరుగులు సాధిస్తే.. టీం ఇండియాలో మళ్లీ ఆడే అవకాశం దక్కుతుంది. అలాగే IPL 2026 వేలంలో అతనికి ప్రయోజనం చేకూరుతుంది.
కాగా ఇషాన్ చాలా కాలంగా టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు. అతడు నవంబర్ 28, 2023న ఆస్ట్రేలియాతో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ ప్రదర్శన ఆకట్టుకోలేదు. ఒక్క పరుగు చేయకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత BCCI అతన్ని సెంట్రల్ కాంట్రాక్ట్ నుండి తొలగించింది. ఈసారి ఇషాన్ తిరిగి సెంట్రల్ కాంట్రాక్ట్‌లోకి వచ్చినప్పటికీ, అతను ఇప్పటికీ భారత జట్టులో స్థానం సంపాదించలేదు.
Follow Us