/rtv/media/media_files/2025/11/15/jadeja-2025-11-15-11-24-35.jpg)
ఐపీఎల్(IPL 2026) ట్రేడింగ్ మొదలైంది. మినీ వేలానికి ముందే ట్రేడ్ డీల్స్ ను పూర్తి చేసుకుంటున్నాయి టీమ్ లు. తాజాగా ఎనిమిది మంది ఆటగాళ్ల ట్రేడ్ పూర్తయినట్టుఐపీఎల్ ధ్రువీకరించింది. వీటిని ఐపీఎల్ అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు. అన్నింటి కంటే ఎక్కువగా రవీంద్ర జడేజా(Ravindra Jadeja)డీల్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం రవీంద్రజడేజా, సామ్‌కరణ్ రాజస్థాన్ రాయల్స్ గూటికి, సంజుశాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చారు.
Also Read : IND Vs SA: సౌతాఫ్రికా ఆలౌట్.. దుమ్ములేపిన భారత్ బౌలర్లు
నాలుగు రోజుల క్రితమే ఊపందుకున్న వార్తలు..
నాలుగు రోజుల నుంచీ రవీంద్ర జడేజా టీమ్ మార్పు గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. రవీంద్ర జడేజాఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కనిపించకపోవడంతో ఊహాగానాలు మొదలైయ్యాయి. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జడేజాను వదులుకోవడానికి సిద్ధమైందని అందరూ అనుకున్నారు. ఐదుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాజస్థాన్ రాయల్స్ (RR) కెప్టెన్ సంజూశాంసన్ ను తమ జట్టులోకి తీసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది. ధోని తర్వాత జట్టుకు దీర్ఘకాలిక వికెట్ కీపింగ్, కెప్టెన్సీ ఎంపికగా శాంసన్‌నుCSK భావించింది. అందుకే సంజూశాంసన్‌ను ట్రేడ్ చేయాలని భావించింది. అయితే అతనిని ట్రేడ్ చేయాలంటే..అందుకు ప్రతిగా CSK తమ కీలక ఆటగాళ్లైన రవీంద్ర జడేజా , సామ్ కరన్ లను ఇవ్వాలని ఆర్ఆర్ పట్టుబట్టింది. మొదటి నుంచీ అదే ట్రేడి చేసింది. చివరకు ఆర్ఆర్ పట్టుదల విజయవంతం అయింది. జడేజా ట్రేడ్ డీల్ సక్సెస్ అయింది. అయితే ఇందులో అన్నింటి కంటే ముఖ్యమైన విషయం ఏంటంటే..రాజస్థాన్ రాయల్స్ లోకి వచ్చేందుకు జడేజా తన ఫీజులో నాలుగు కోట్లను తగ్గించుకున్నాడు. సీఎస్కేలో అతని పే 18 కోట్లు కాగా..ఇప్పుడుఆర్ఆర్ లో 14 కోట్లకేజాయిన్ అవుతున్నారు. మరోవైపెసంజూశాంసన్ మాత్రం అదే ధర, రూ.18 కోట్లకేసీఎక్కేకు వెళ్ళాడు.
Aaj rumour nahi, headline likhna. Ravindra 𝑻𝒉𝒂𝒍𝒂𝒑𝒂𝒕𝒉𝒚 Jadeja is coming home ⚔️🔥 pic.twitter.com/XJT5b5plCy
— Rajasthan Royals (@rajasthanroyals) November 15, 2025
అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి మహమ్మద్ షమీ...లఖసవూ సూపర్ జెయింట్స్ కు మారాడు. సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ కూడా ముంబై ఇండియన్స్ నుంచి లఖ్నవూకు చేరాడు. మయాంక్ మార్కండేకోల్కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి ముంబయి టీమ్‌లోకి వచ్చాడు. నితీశ్ రాణా రాజస్థాన్ రాయల్స్ నుంచి దిల్లీక్యాపిటల్స్‌కు, డోనోవన్ఫెరీరాదిల్లీ క్యాపిటల్స్ నుంచి రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వచ్చారు.
డిసెంబర్ 16 మినీ వేలం..
ఇక ఐపీఎల్ 2026 మినీ వేలం నిర్వహణకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. డిసెంబర్ 16న అబుదాబి వేదికగా ఈ వేలం జరగనుంది. ఇది మినీ వేలం కాబట్టి ఫ్రాంచైజీలు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడంలో ఎలాంటి పరిమితులు లేవు. తమకు నచ్చిన ఆటగాళ్లను రిటైన్ తీసుకోవచ్చు లేదా వదిలేయవచ్చు. అయితే 10 జట్లు తమ రిటెన్షన్ జాబితాను నేడు ప్రకటించనుంది. సాయంత్రం 5 గంటలకు స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా ద్వారా అధికారికంగా విడుదల చేయనున్నారు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి ప్రధాన జట్లలో భారీ మార్పులు ఉంటాయని తెలుస్తోంది.
Also Read: Bihar Elections: బీహార్ పాలిటికల్స్ లో బిగ్ ట్విస్ట్.. సీఎంగా చిరాగ్ పాశ్వాన్?
Follow Us