/rtv/media/media_files/2025/11/07/pak-va-sa-2025-11-07-06-35-47.jpg)
పాకిస్తాన్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా(pak-vs-sa) జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా తమ విజయ లక్ష్యాన్ని మరో 59 బంతులు మిగిలి ఉండగానే ఛేదించడం విశేషం.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. సల్మాన్ ఆఘా (69), మహ్మద్ నవాజ్ (59), సయీమ్ అయూబ్ (53) అర్ధ సెంచరీలతో రాణించారు.
Also Read : WPL.. ఏఏ ప్రాంఛైజీలు ఎవరెవర్ని రిటైన్ చేసుకున్నాయంటే..
270 పరుగుల లక్ష్యంతో
Quinton De Kock was retired for more than a year. Comes back and scores a 100 in his 6th innings.
— Cricketism (@MidnightMusinng) November 6, 2025
Meanwhile, Babar Azam hasn’t scored a 100 in international cricket since August 2023 !!!! #PAKvSA#PAKvsSA#PakistanCricket
pic.twitter.com/Sjd7jggdLZ
సఫారీ బౌలర్లలో నాండ్రె బర్గర్ 4 వికెట్లు, న్గాబా పీటర్ 3 వికెట్లు పడగొట్టారు. 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా కేవలం 40.1 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (119 బంతుల్లో 123 నాటౌట్)8 ఫోర్లు, 7 సిక్స్‌లు.. అజేయ సెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. టోనీ డి జోర్జి (63 బంతుల్లో 76) కూడా కీలక పాత్ర పోషించాడు.
Also Read : ప్రధాని మోడీకి క్రికెటర్ హర్లీన్ డియోల్ చిలిపి ప్రశ్న..ఏం అడిగిందంటే?
సెంచరీ సాధించిన క్వింటన్ డికాక్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను దక్షిణాఫ్రికా 1-1 తో సమం చేసింది. సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరి వన్డే ఉత్కంఠభరితంగా మారనుంది.
South Africa delivered an impressive batting display, comfortably chasing a 270-run target to defeat Pakistan by eight wickets in the second ODI at Faisalabad's Iqbal Stadium on Thursday.#PakvsSA#Pakistancricketpic.twitter.com/AqJNsefNYY
— Safety & Security Today (@SSTodayPk) November 6, 2025
Follow Us