/rtv/media/media_files/2025/11/16/fotojet-2025-11-16t073116245-2025-11-16-07-31-40.jpg)
Gill in ICU with neck pain?
టీమిండియా(team-india) కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ను ఐసీయూలో చేర్చారు. సౌతాఫ్రికా(india vs south africa live)తో టెస్ట్ ఆడుతున్న సమయంలో గిల్ మెడ నొప్పితో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. కాగా నొప్పి అధికం కావడంతో అతడిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సిబ్బంది అతనికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
వివరాల ప్రకారం..కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్- సౌతాఫ్రికా మధ్య తొలి మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. రెండో రోజు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఆడుతున్న సమయంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ నొప్పితో బాధపడ్డాడు. దీంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. నొప్పి అధికమవ్వడంతో గిల్‌ను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లారు. నొప్పి ఎక్కువగా ఉన్న దృష్ఠ్యా ఆయనకు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : ఐపీఎల్ 2026 వేలం.. ఏ ఫ్రాంచైజీ ఎవరిని రిలీజ్ చేసిందంటే?
Shubman Gill In ICU With Neck Pain
గిల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మెడ కండరాలు పట్టేయంతో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. తొలి ఓవర్‌లో కేవలం మూడే బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులు చేశాడు. మెడ పట్టేసి నొప్పి ఎక్కువవడంతో మైదానాన్ని వీడాడు. అయితే గిల్ ను ప్రస్తుతం కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. మెడకు సర్వైకల్ కాలర్‌తో స్ట్రెచర్‌పై తీసుకెళ్లడంతో ఆయనకు సివియర్ ఇంజూరీ అయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తుది పరీక్షల అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఆసుపత్రి వర్గాలు అంటున్నాయి. ఉన్నట్టుండి కెప్టెన్ గిల్ నొప్పితో మైదానాన్ని వీడటంతో అభిమానులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.
ఈ విషయంపై బీసీసీఐ(BCCI) ఇప్పటికే స్పందించింది. గిల్‌కు మెడ పట్టేయంతో ఆసుపత్రికికి తరలించామని, బీసీసీఐ మెడికల్ టీమ్ అతడిని పర్యవేక్షిస్తుందని వివరించింది. మరోవైపు టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ కూడా గిల్ గాయంపై మాట్లాడాడు. నిద్ర లేమి కారణంగా మెడ కండరాలు పట్టేశాయని, గిల్ త్వరలోనే రికవరీ అవుతాడని తెలిపారు. కాగా ఈ తీవ్ర గాయంతో గిల్ కోల్‌కతా టెస్టుకు దూరమయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది.
Also Read : రెండో పెళ్లికి సిద్ధమైన మాజీ కెప్టెన్.. తనకంటే 18 ఏళ్ల చిన్నదైన అమ్మాయితో రిలేషన్..!
Follow Us