/rtv/media/media_files/2025/11/09/rajeet-2025-11-09-08-38-52.jpg)
టీమిండియా(team-india) యువ బ్యాట్స్‌మెన్న రజత్ పటీదార్(rajat-patidar) కి తీవ్ర గాయం కారణంగా సుదీర్ఘ విరామం తప్పడం లేదు. సౌత్ ఆఫ్రికా 'ఎ' పర్యటన సందర్భంగా గాయపడిన పటీదార్, కోలుకోవడానికి దాదాపు నాలుగు నెలల సమయం పట్టవచ్చని సమాచారం. ఈ గాయం రజత్ పటీదార్ కెరీర్‌కు, రానున్న దేశవాళీ సీజన్‌కు పెద్ద అడ్డంకిగా మారింది. ఇటీవల దక్షిణాఫ్రికా 'ఎ' జట్టుతో జరిగిన మ్యాచ్‌ల సమయంలో రజత్ పటీదార్ గాయపడ్డాడు.
Also Read : సౌరవ్ గంగూలీని ఆపడం ఎవరి తరం కాదు: మమతా బెనర్జీ కీలక కామెంట్స్!
🚨🚨TOUGH NEWS FOR RAJAT
— Prashant (@PrashantMe50458) November 9, 2025
PATIDAR SUPPORTERS
Rajat Patidar is sidelined from cricket for around 4 months owing to an injury. (via Abhishek Tripathi) #RCB 🚨 pic.twitter.com/dYz7IXXU3z
ఈ సుదీర్ఘ విరామం కారణంగా, దేశవాళీ క్రికెట్‌లో అత్యంత కీలకమైన రంజీ ట్రోఫీ సీజన్‌లోని ఎక్కువ భాగం మ్యాచ్‌లకు పటీదార్ అందుబాటులో ఉండలేడు. మధ్యప్రదేశ్ జట్టు కెప్టెన్‌గా ఉన్న అతనికి, జట్టుకు ఇది పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి. గత కొంతకాలంగా దేశవాళీల్లో అద్భుతంగా రాణించి, టెస్ట్ జట్టులో ప్రత్యామ్నాయ ఆటగాడిగా ఎంపికయ్యే రేసులో పటీదార్ ఉన్నాడు. ఈ గాయం అతని భారత జట్టు అవకాశాలను తాత్కాలికంగా ఆలస్యం చేసే అవకాశం ఉంది.
Also Read : ఒక్క వికెట్ తీస్తే.. ఆ నలుగురి సరసన బుమ్రా!
వచ్చే ఏడాది ఐపీఎల్
రజత్ పటీదార్ గాయం నుంచి పూర్తిగా కోలుకుని, మళ్లీ ఫిట్‌నెస్ సాధించి, వచ్చే ఏడాది (2026)లో జరిగే ఐపీఎల్ సీజన్ ప్రారంభం నాటికి తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అతను కోలుకునే ప్రక్రియను నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) పర్యవేక్షించనుంది.
Follow Us