Vaibhav Suryavanshi: వైభవ్ విధ్వంసం.. 42 బంతుల్లో 144 పరుగులు - సిక్సర్ల వర్షం

వైభవ్ సూర్యవంశీ UAE Aతో జరిగిన మ్యాచ్‌లో 32 బంతుల్లోనే సెంచరీ సాధించి సంచలనం సృష్టించాడు. 32 బంతుల్లో సెంచరీ చేసిన తర్వాత కూడా వైభవ్ ఆగలేదు. అతడు 42 బంతులు ఎదుర్కొని 144 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 11 ఫోర్లు, 15 సిక్సర్లు కొట్టి ఔటయ్యాడు.

New Update
vaibhav suryavanshi against uae a

vaibhav suryavanshi against uae a

టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇటీవలే పురుషుల ఆసియా కప్, మహిళల వరల్డ్ కప్.. ఇలా పెద్ద పెద్ద టోర్నీలను గెలుచుకుని భారత సత్తా చూపిస్తోంది. ఇక ఇప్పుడు ACC పురుషుల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్ జరుగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ దోహ్‌లో ఇండియా A, UAE A మధ్య జరిగిన మ్యాచ్‌లో 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ చితక్కొట్టేశాడు. 

Also Read :  ‘అతడు మరగుజ్జుడే’.. సౌతాఫ్రికా కెప్టెన్‌పై బుమ్రా కాంట్రవర్సియల్ కామెంట్స్ - వీడియో

Vaibhav Suryavanshi Against UAE A

కేవలం 32 బంతుల్లోనే సెంచరీ సాధించి సంచలనం సృష్టించాడు. 32 బంతుల్లో సెంచరీ చేసిన తర్వాత కూడా వైభవ్ ఆగలేదు. అతడు 42 బంతులు ఎదుర్కొని 144 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యవంశీ ఈ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 15 సిక్సర్లు కొట్టి 342.86 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. అయితే 12.3వ ఓవర్‌లో మహ్మద్ ఫరాజుద్దీన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. వైభవ్ తో పాటు, ప్రియాంష్ ఆర్య 6 బంతుల్లో 10 పరుగులకు అవుటయ్యాడు. నామంధీర్ కూడా 23 బంతుల్లో 34 పరుగులు చేశాడు. నేహల్ వాధేరా 9 బంతుల్లో 14 పరుగులు చేశాడు. - IND Vs UAE 2025

Also Read :  ‘అవును ఆమె నా భార్యే’.. రెండో పెళ్లి చేసుకున్న క్రికెటర్ రషీద్ ఖాన్ - సంచలన పోస్ట్

2025-26 రంజీ ట్రోఫీలో బీహార్ తరపున వైభవ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మేఘాలయపై 93 పరుగులు చేశాడు. దీనికి ముందు అతను ఆస్ట్రేలియా అండర్-19పై ఇండియా అండర్-19 తరపున 113 పరుగులు చేశాడు. అతను నిలకడగా మంచి ప్రదర్శన ఇచ్చాడు. గతంలో వైభవ్ IPL 2025లో తన క్విక్ ఫైర్ సెంచరీతో దుమ్ము దులిపేశాడు. 2025 ఐపీఎల్‌లో వైభవ్ ఏడు మ్యాచ్‌ల్లో 36 సగటు, 206.55 స్ట్రైక్ రేట్‌తో 252 పరుగులు చేశాడు. 

Advertisment
తాజా కథనాలు