BIG BREAKING: కొత్త మంత్రులకు కేటాయించే శాఖలివే.. సీఎం రేవంత్ కీలక ప్రకటన!
మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తన దగ్గర ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయిస్తానని చెప్పారు.
మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తన దగ్గర ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయిస్తానని చెప్పారు.
బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుపై ఎన్నికల సమయంలో దాఖలైన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. హరీష్ రావు పిటిషన్లో తప్పులు ఉన్నాయంటూ చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. సరైన ఆధారాలు చూపకపోవడంతో కోర్టు కొట్టివేసింది.
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తునని వైఎస్ జగన్ అన్నారు. 70 ఏళ్ల వృద్ధుడైన, సీనియర్ జర్నలిస్టును అరెస్టు చేసి కక్షసాధింపుల విష సంస్కృతిని కూటమి సర్కార్ పతాక స్థాయికి తీసుకెళ్లిందని ఫైర్ అయ్యారు.
తనకు మంత్రి పదవి ఇవ్వడానికి సామాజిక వర్గమే అడ్డయితే రాజీనామా చేయడానికి సిద్ధమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి స్పష్టం చేశారు. తమ మొరను అధిష్టానం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ లైన్లోనే పనిచేస్తామని ప్రకటించారు.
గత కొద్ది రోజులుగా కొండా సురేఖ మంత్రి పదవి పోతుందన్న చర్చకు బ్రేక్ పడింది. నేడు ఎలాంటి తొలగింపులు లేకుండానే మంత్రి వర్గ విస్తరణను పూర్తి చేశారు సీఎం రేవంత్. దీంతో సురేఖ, ఆమె అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ముగిశాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమయాత్రలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు.
కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. శ్రీహరికి హోం శాఖ, వివేక్ కు విద్య, అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ సంక్షేమ శాఖలను అప్పగించాలని సీఎం రేవంత్ డిసైడ్ అయినట్లు సమాచారం. సాయంత్రంలోగా ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.
తెలంగాణలో రేపు మంత్రివర్గ విస్తరణ ఖాయమైంది. ఈ నేపథ్యంలో కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించడానికి ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ రేపు ఉదయం హైదరాబాద్ కు రానున్నారు. సాయంత్రం రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది.
హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పరిధి కాటేదాన్‌లో దారుణం చోటుచేసుకుంది. మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన సలీమ్ తాగిన మైకంలో తన భార్యను చంపాలనుకొని పక్కంటి మహిళపై కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు.