Kannappa: రజినీకాంత్ కోసం కన్నప్ప స్పెషల్ షో.. ఆయన ఇచ్చిన అదిరిపోయే రివ్యూ ఇదే!

ఈ నెల 27న విడుదల కానున్న కన్నప్ప సినిమాకు ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు సూపర్ స్టార్ రజినీకాంత్. స్పెషల్ షో చూసిన తర్వాత హీరో విష్ణును కౌగిలించుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా తనకు బాగా నచ్చిందని చెప్పారు.

New Update
Kannappa Rajineekanth Review

Kannappa Rajineekanth Review

ఈ నెల 27న విడుదల కానున్న కన్నప్ప మూవీపై సూపర్ స్టార్ రజినీ కాంత్ తన స్టైల్లో రివ్యూ ఇచ్చారు. రజినీకాంత్ కోసం మోహన్ బాబు, విష్ణు నిన్న రాత్రి స్పెషల్ షో వేశారు. సినిమా అనంతరం విష్ణును రజినీకాంత్ గట్టిగా కౌగిలించుకున్నాడు. తనకు సినిమా బాగా నచ్చిందంటూ చెప్పారు. ఈ వివరాలను మంచు విష్ణు తన X ఖాతాలో పోస్ట్ చేశారు. ఇది తనకు మరింత ఉత్సాహం నింపిందన్నారు. రజినీకాంత్ కు ధన్యవాదాలు తెలిపారు. 

సెన్సార్ బోర్డు అభ్యంతరం..

ఇదిలా ఉంటే.. మంచు విష్ణు కన్నప్ప సినిమా విడుదలకు ముందే ఇబ్బందులు ఎదుర్కొంటుంది. సినిమాలో బ్రహ్మణులను అవమానపరిచేలా సీన్లు ఉన్నాయని ఆ వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో సినిమాలోని 13 సీన్లు తొలగించే అవకాశం కనపడుతోంది. జూన్‌ 27న రిలీజ్‌ చేయాలనుకున్న సినిమా ఆ రోజు చేస్తారా? లేదా మళ్లీ వాయిదా పడుతుందా? అనే సందేహం నెలకొంది. సినిమాలో ఉన్న 13 సీన్లు సమాజంలో అనవసరమైన దృక్పథాలను ప్రదర్శిస్తున్నాయని బ్రహ్మణచైతన్య వేదిక అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో సెన్సార్‌ బోర్డు జోక్యం చేసుకుంది.

ఈ సినిమా విడుదలకు ముందు, 13 సీన్లపై 11 మంది సభ్యుల కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది.  సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లు అభ్యంతరకరంగా ఉన్నాయని అభిప్రాయపడింది. వాటిని తొలగించి మళ్లీ ప్రివ్యూ ఇవ్వాలని సూచించింది. దీంతో 13 సీన్లు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాతే కన్నప్ప సినిమాకు అనుమతి ఇవ్వనున్నట్లు  సెన్సార్ బోర్డు తెలిపింది.  కాగా ఈ సీన్లు తొలగిస్తే సినిమా అర్థవంతంగా ఉంటుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ ఆ సీన్లు కీలక సన్నివేశాల సమయంలో వచ్చే అవకాశం ఉంటే ఆ సన్నివేశాలను తిరిగి షూట్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో జూన్‌ 27న రిలీజ్‌ చేస్తారా? వాయిదా వేస్తారా? అనేది తేలాల్సి ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు