New Update
ములుగు జిల్లా వాతావరణం నెలకొంది. చల్లాక అటవీ భూముల్లో గిరిజనులు గుడిసెలు వేసుకున్నారు. వాటిని తొలగించేందుకు అటవీశాఖ అధికారులు, పోలీసులు భారీఎత్తున మొహరించారు. రిజర్వ్ ఫారెస్ట్‌లో గుడిసెలు వేసుకున్నారని చెబుతున్న అటవీశాఖ, పోలీసులు వాటిని తొలిగించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, అటవీశాఖ అధికారులపై గిరిజనులు తిరగబడ్డారు. ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. కారంపొడి, కర్రలతో గిరిజనులు ఎదురుదాడికి దిగారు. ఈ దాడిలో పలువురు పోలీసులు, అటవీశాఖ అధికారులకు గాయాలయ్యాయి.
తాజా కథనాలు