Telangana: తెలంగాణ లో భిన్న వాతావరణం.. ఆ జిల్లాల్లో వర్షాలు.. ఈ జిల్లాల్లో ఎండలు.. !
తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మాజీ మంత్రి ఎర్రబెల్లి వయస్సుతో పాటు హుందాతనాన్ని కాపాడుకోవాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ సత్తా ఏంటో లోకల్ బాడీ ఎన్నికల్లో చూపిస్తామని అన్నారు. ఇప్పుడే కాదు తెలంగాణలో మరోసారి రాబోయేది కూడా కాంగ్రెస్ సర్కారే అంటూ ధీమా వ్యక్తం చేశారు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి కోసం కన్న తండ్రికి తలకొరివి పెట్టడానికి ఓ కొడుకు ముందుకు రాలేదు. దీంతో చేసేది ఏమీ లేక చిన్న కూతురుతో తండ్రి తలకొరివి పెట్టించి అంత్యక్రియలు జరిపించారు.
తెలంగాణ టెన్త్ ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. గ్రేడింగ్ విధానాన్ని తొలగించి మార్కులు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే జీఓ జారీ చేసింది. దీంతో మెమోల ముద్రణ ఎలా ఉండాలనే దానిపై స్పష్టత రావట్లేదట. అది తేలితేనే ఫలితాలు విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఆదిలాబాద్ ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో పిల్లలపై గుర్తు తెలియని దండుగులు విష ప్రయోగయత్నానికి పాల్పడ్డారు. తాగే నీటి ట్యాంకులో విషం కలపడం, మధ్యాహ్న భోజనపు వంట సామాగ్రికు పురుగుల మందు పూశారు. ప్రిన్సిపల్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది.
టీచర్‌గా ఉద్యోగం చేస్తున్న ఓ కోడలు ఆస్తి కోసం మామ కంట్లో కారం చల్లి దాడి చేసిన ఘటన ఖమ్మంలో జరిగింది. తన ఇద్దరు చెల్లెళ్లతో కోడలు ఆ దాడికి పాల్పడింది. ఆస్తి కోసం గత మూడేళ్ల నుంచి మామను వేధిస్తోంది. వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన 'భూ భారతి' చట్టంలో ప్రతి అప్లికేషన్‌కు ఒక డెడ్ లైన్ విధించింది. భూ రికార్డుల్లో తప్పులు, వివరాలు లేకపోయినా ఏడాదిలోపు నిర్దేశించిన ఫీజు చెల్లించి సవరణలు కోరవచ్చు. మరికొన్నింటికి 30 నుంచి 90 రోజుల సమయం కేటాయించింది.
కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వివాదంపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మంత్రి పొంగులేటి తనని.. కేసీఆర్ ఆత్మ అని అంటున్నారు..కేసీఆర్ లేకుంటే పొంగులేటి ఎక్కడ ఉండేవాడని ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు కాకపోయిన ఇంకొద్దిరోజులు కైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని... వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పారు.