/rtv/media/media_files/2025/04/16/snfOJTuk7UIYsEIwBpZy.jpg)
TG 10th Results: తెలంగాణ టెన్త్ ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. గ్రేడింగ్ విధానాన్ని తొలగించి మార్కులు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే జీఓ జారీ చేసింది. దీంతో మెమోల ముద్రణ ఎలా ఉండాలనే దానిపై స్పష్టత రావట్లేదట. అది తేలితేనే ఫలితాలు విడుదల చేయనున్నట్లు సమాచారం.
రేవంత్ సర్కార్ GO జారీ..
ఈ మేరకు గత ప్రభుత్వంలో ప్రవేశ పెట్టిన గ్రేడింగ్ విధానానికి స్వస్తి చెప్పి మార్కులు ఇవ్వాలని రేవంత్ సర్కార్ GO జారీ చేసింది. అయితే మార్కులకు సంబంధించిన మెమోల ముద్రణపై ఇప్పటికే మంతనాలు జరపగా దీనిపై తుది నిర్ణయం వెలువడలేదట. దీంతో మెమోల జారీ అశం తేలితేనే రిజల్ట్స్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జవాబుపత్రాల మూల్యాంకనం కూడా పూర్తి కాగా.. ఏప్రిల్ చివరి వారం వరకు ఫలితాలు వెల్లడించాలని విద్యాశాఖ అధికారులు ప్లాన్ చేస్తున్నారట. ఈ లోగా ప్రభుత్వం నుంచి మెమోలా అంశంపై స్పష్టమైన ప్రకటన రాకపోతే మరింత ఆలస్యం అవుతుందని, దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, సమాజం నుంచి తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.
NCERT ప్రతిపాదన..
ఇదిలా ఉంటే.. గతంలో మోమోలపై ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి, ఫెయిల్ అని రాసేవారు. కానీ ఇప్పుడు పాస్, ఫెయిల్ అని ఇస్తే చాలని NCERT సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ప్రథమ మార్కులు సాధించినవారిని ప్రోత్సహించేలా ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్ అని ఇవ్వాలని, 35 మార్కుల కన్నా తగ్గితే ఫెయిల్ అని రాయాలని ప్రభుత్వానికి ఎస్‌సీఈఆర్‌టీ అధికారులు ప్రతిపాదించారట. దీనిపై నెల గడుస్తున్నా ప్రభుత్వం జవాబు ఇవ్వకపోవడతో NCERT అధికారులు సచివాలయానికి వెళ్లి విద్యాశాఖ అధికారులను ఆరా తీసినట్లు సమాచారం.
Also read : Teeth Brush: ప్రతిరోజూ సరిగ్గా పళ్లు తోముకోకపోతే ఈ 5 ప్రాణాంతక వ్యాధులు వస్తాయి
మరోవైపు గ్రేడింగ్ విధానమే కొనసాగించాలని డిమాండ్ వినిపిస్తున్నాయి. మార్కులు ప్రవేశపెడితే ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తామని ట్రస్మా తరఫున వినతిపత్రాలు అందినట్లు యాదగిరి శేఖర్‌రావు తెలపడం చర్చనీయాంశమైంది. కానీ 10వ తరగతి గ్రేడింగ్ విధానం 2024 నవంబరులోనే ప్రభుత్వం ఎత్తివేసింది. ఇంటర్నల్ 20 మార్కులు ఉంటాయని తెలిపింది. కానీ ఇంటర్నల్ మార్క్స్ తొలగిస్తే ఫలితాల్లో మార్కులు తగ్గే అవకాశం ఉందని పాఠశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి.
Also read : TG 10th Results: తెలంగాణ టెన్త్ ఫలితాలపై బిగ్ అప్‌డేట్.. అది తేలితేనే ఫలితాలు !
10th-class-results | telangana | memo | telugu-news | today telugu news