/rtv/media/media_files/2025/04/16/CKzIjuXBBS3xzFxy203C.jpg)
Adilabad in school
ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. ధరంపూరి గ్రామంలోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలోని పిల్లలపై విష ప్రయోగయత్నానికి పాల్పడ్డారు. కొందరు గుర్తు తెలియని దుండగులు విద్యార్థులు తాగే నీటి ట్యాంకులో విషం కలపడంతో పాటు మధ్యాహ్న భోజనపు వంట సామాగ్రికు పురుగుల మందు పూశారు.
ఇది కూడా చూడండి: Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో
బ్రేకింగ్ న్యూస్
— Telugu Scribe (@TeluguScribe) April 16, 2025
ప్రభుత్వ పాఠశాలలో పిల్లల పై విష ప్రయోగయత్నం.. తప్పిన పెను ప్రమాదం
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధరంపూరి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పిల్లల పై విష ప్రయోగయత్నం కలకలం
విద్యార్థులు త్రాగే నీరు ట్యాంకులో విషం కలిపి, మధ్యాహ్న భోజనపు వంట సామాగ్రికు పురుగుల… pic.twitter.com/DZ9a94yE3K
ఇది కూడా చూడండి: Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!
పాఠశాల ఆవరణంలో పురుగుల మందు డబ్బా..
ప్రధానోపాధ్యాయురాలు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. పాఠశాల ఆవరణలో పురుగులు మందు డబ్బా కనిపించడం, పురుగుల మందు వాసన రావడంతో.. అప్రమత్తమయ్యారు. అదృష్టవశాత్తు 30 మంది విద్యార్థులు ఈ విష ప్రయోగం నుంచి క్షేమంగా బయట పడ్డారు. దీంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇది కూడా చూడండి: MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థులపై విష ప్రయోగం ఎవరు చేశారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. పిల్లలను చంపాలని ప్లాన్ చేసిన వారికి కఠిన చర్యలు తీసుకోవాలని స్కూల్ యాజమాన్యం తెలిపింది.