/rtv/media/media_files/2025/04/16/zGZHeSsz0PCwnR5VYker.jpg)
son-and-father
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి కోసం ఓ కొడుకు మానవత్వాన్ని మరిచి పోయాడు. ఆస్తి కోసం కన్న తండ్రికి తలకొరివి పెట్టడానికి ఓ కొడుకు ముందుకు రాలేదు. పద్మావతి కాలనీకి చెందిన మాణిక్యరావు బుధవారం మృతి చెందాడు. అయితే సంప్రాదాయాల ప్రకారం తల్లిదండ్రులు చనిపోతే కుమారులే అంత్యక్రియలు జరిపించాల్సి ఉంటుంది.
ఆస్తి ఇస్తే తప్ప తలకొరివి పెట్టను
అయితే ఆస్తి ఇస్తే తప్ప తలకొరివి పెట్టనని స్మశానంలో అడ్డం తిరిగాడు మాణిక్యరావు కొడుకు. కోటి రూపాయల ఇల్లు, 10 తులాల బంగారం తన పేరు మీద రాసి ఇస్తేనే తన తండ్రికి కొరివి పెడతానని పట్టుబట్టాడు. కుటుంబ సభ్యులు, బంధువులు ఎంత చెప్పిన వినలేదు. దీంతో చేసేది ఏమీ లేక మాణిక్యరావు చిన్న కూతురుతో తండ్రి తలకొరివి పెట్టించి అంత్యక్రియలు జరిపించారు బంధువులు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలానికి చెందిన మాణిక్యరావు (80) ప్రభుత్వ ఉద్యోగిగా సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ డిపార్ట్మెంట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. ముగ్గురు పిల్లల పెళ్లిళ్లు చేసిన. భార్యను కోల్పోయిన మాణిక్యరావు మిగిలిన జీవితాన్ని తన పిల్లలతో సంతోషంగా గడపాలని కోరుకున్నాడు. తనకు ఉన్న ఆస్తిలో కొడుకు గిరీష్‌కు 15 ఎకరాల వ్యవసాయ భూమిని, రూ.60 లక్షల నగదును ఇచ్చాడు. మహబూబ్ నగర్‌లో ఉన్న తన ఇంటిని మాత్రం తన ఇద్దరు కుమార్తెల పేరుపై రిజిస్టర్ చేశాడు. అయితే ఆ ఇంటిని తన పేరు మీద రాయలంటూ గిరీష్ పట్టుబడుతున్నాడు.
ఆస్థి కోసం తండ్రికి తలకొరివి పెట్టని కొడుకు.
— Govind Yadav Tg (@govindyadav_tg) April 16, 2025
మహబూబ్ నగర్ పద్మావతి కాలనీకి చెందిన తండ్రి మాణిక్య రావుకి తలకొరివి పెట్టని కొడుకు కోటి రూపాయల ఇల్లు,10 తులాల బంగారం ఇస్తేనే తండ్రికి తలకొరివి పెడతానని గొడవ పెట్టుకున్న కొడుకుచివరికి చిన్న కూతురితో తలకొరివి పెట్టించిన బంధువులు.. pic.twitter.com/jDbt9qzcW3