BREAKING: HCU భూముల వివాదంలో రేవంత్ సర్కార్‌కు షాక్.. సుప్రీంకోర్టు చురకలు

కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వివాదంపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

New Update
Supreme Court Key Comments on HCU Lands

Supreme Court Key Comments on HCU Lands

కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వివాదంపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా జస్టీస్ గవాయ్‌ ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. జంతువులు ఆశ్రయం లేక అక్కడ తిరగడం షాకింగ్‌గా ఉందని తెలిపింది. వారాంతపు సెలవుల్లో 3 రోజుల్లో చెట్లు కొట్టాల్సిన తొందర ఎందకు వచ్చిందని నిలదీసింది. మీరు చెట్లు నరికివేయడం వల్ల అక్కడి జంతువుల మీద కుక్కలు దాడి చేస్తున్నాయని ఈ వీడియోలు కూడా మేము చూశామని తెలిపింది. 

చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దని చెప్పింది. చెట్లు నరికేందుకు పర్మిషన్ తీసుకోకపోతే అధికారులను జైలుకు పంపుతామని హెచ్చరించింది. అలాగే చీఫ్ సెక్రటరీ శాంతి కుమారిని కాపాడాలనుకుంటే నరికివేసిన ఆ 100 ఎకరాల్లో చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో ఓ ప్రణాళికతో రావాలని ఆదేశించింది. చివరికి మే 15కు విచారణను వాయిదా వేసింది. స్టేటస్‌ కో ను అలాగే కొనసాగించాలని స్పష్టం చేసింది.  

Also Read: విషాదం.. ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి.. !

''సిటీలో గ్రీన్‌ లంగ్ స్పేస్ ఉండాలి. చెట్ల నరికివేతకు పర్మిషన్ తీసుకున్నారా ? లేదా ? సూటిగా సమాధానం చెప్పండి. అభివృద్ధి జరగాలి.. కానీ అడవులను నాశనం చేయకూడదు. పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీ లేదు. ప్రైవేట్‌ ఫారెస్ట్‌లో చెట్లు నరికివేసినా సీరియస్‌గా తీసుకుంటాం.  అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసినందుకు సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. సెల్ఫ్ సర్టిఫికెట్ చేసుకొని అన్నింటికీ మినహాయింపులు ఇచ్చుకున్నారు, ఇది సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధం. భూముల తాకట్టు అంశంతో మాకు సంబంధం లేదు. కేవలం నరికిన చెట్లను ఎలా పునరుద్దన చేస్తారనేదే మా ప్రాధాన్యత. 

1996 డిసెంబర్ లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏమాత్రం వ్యవహరించినా చూస్తూ ఊరుకొము. భూములను తాకట్టు పెట్టారా లేదా అమ్ముకున్నారో లేదో మాకు అనవసరం. చెట్లు కొట్టేసే ముందు అనుమతి ఉందా లేదా అనేది ముఖ్యం. మీరు అభివృద్ధి చేసుకోవాలనుకుంటే తగిన అనుమతులు తీసుకోండి. వంద ఎకరాల్లో జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చాలి అన్న విషయం పైనే మేము దృష్టి సారించామని'' జస్టిస్ గవాయ్‌ ధర్మాసనం తెలిపింది. 

Also Read: హైదరాబాద్‌లో మరో డిజిటల్ అరెస్ట్.. మహిళా ప్రొఫెసర్‌ నుంచి రూ. కోట్లు దోచేసిన కేటుగాళ్లు!

ఇదిలాఉండగా.. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని తెలంగాణ సర్కార్‌ మంగళవారం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తెలిపింది.  అది అటవీభూమి కాదని.. పూర్తిగా ప్రభుత్వ భూమేనని స్పష్టం చేసింది. రెండు దశాబ్దాలుగా దీనిపై న్యాయవివాదం కొనసాగడంతో ఆ ప్రాంతాన్ని ఖాళీగా వదిలేయడం వల్ల చెట్లు పెరిగాయని తెలిపింది.  ప్రభుత్వం అక్కడ అభివృద్ధి చేస్తే పెట్టుబడులు ఆకర్షించి వేగంగా ఉద్యోగాల సృష్టికి వీలవుతుందని చెప్పింది. 

''ఈ భూమి ఓపెన్‌గా ఉండటం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జంతువులు వచ్చివెళ్తున్నాయి. సెంట్రల్ యూనివర్సిటీ, ఇది కలిపి ఉన్న 2 వేల ఎకరాల్లో జంతువులు తిరుగుతాయి, కానీ వీటికి ఇక్కడ ఆవాసం లేదు. ఈ ప్రాంతంలో అభివ-ృద్ధి కార్యక్రమాలు చేపట్టిన తర్వాత వాటిని ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకుంటాం. ఇక్కడ కొట్టేసిన చెట్లు నిషేధిత విభాగంలోకి రావు. అవసరమైతే ఇందుకోసం ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయిస్తాం. అక్కడ మొక్కల్ని పెంచుతామని'' రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు