తమిళనాడులో మరోసారి భయంకరమైన పేలుడు
తమిళనాడు విరుదునగర్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. అనేక మంది గాయపడ్డారు. శివకాశి-సత్తూరు రోడ్డు పక్కన ఉన్న గోకుల్స్ బాణసంచా దుకాణంలో ఈ పేలుడు సంభవించింది.
తమిళనాడు విరుదునగర్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. అనేక మంది గాయపడ్డారు. శివకాశి-సత్తూరు రోడ్డు పక్కన ఉన్న గోకుల్స్ బాణసంచా దుకాణంలో ఈ పేలుడు సంభవించింది.
తమిళనాడులో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రాణిపేట్ జిల్లాలో అరక్కోణం-కాట్పాడి మెము ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. భారీ శబ్దం వినిపించడంతో ప్రయాణీకులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ట్రైన్ వేగం తక్కువగా ఉండటంతో ఎలాంటి భారీ ప్రమాదం జరగలేదు.
తమిళనాడులో కీలక బిల్లులకు గవర్నర్ ఆర్.ఎన్.రవి ఆమోదం ఆమోదం తెలిపారు. రుణసంస్థలు బెదిరించి బలవంతంగా అప్పు వసూలు చేస్తే ఐదేళ్ల జైలుశిక్ష విధించే బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. అలాగే, బయో వ్యర్థాలకు సంబంధించిన బిల్లుకు కూడా ఆమోదం తెలిపారు.
తమిళనాడలోని పొల్లాచిలో దారుణం జరిగింది. ప్రేమించిన అమ్మాయి స్టేటస్ చూసి తట్టుకోలేక ఓ యువకుడు ఆమెను దారుణంగా చంపేశాడు. హత్యకు గురైన అమ్మాయిని అశ్విక (19)గా గుర్తించారు. పొల్లాచ్చిలోని అన్నామలై నగర్‌కు చెందిన ఆర్ ప్రవీణ్‌కుమార్ (25) ఆమెను హత్య చేశాడు.
తమిళనాడులోని మధురై జిల్లాలో దారుణం జరిగింది. ఆదివారం ఉదయం రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయాలపాలయ్యారు.
తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి తన భార్య జ్ఞాపకార్థం ఏకంగా గుడి కట్టించి పూజలు చేస్తున్నాడు. 2-022లో తన భార్య చనిపోవడంతో ఆమె జ్ఞాపకాలతో జీవిస్తున్న అతను మళ్లీ పెళ్లి చేసుకోలేదు. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.
డీఎంకే నేత లైంగిక వేధింపుల ఇష్యూలో జాతీయ మహిళా కమిషన్ జోక్యం చేసుకుంది. భార్య ఫిర్యాదుతో సుమోటోగా కేసు నమోదు చేసింది. మూడు రోజుల్లోగా యాక్షన్ రిపోర్ట్, ఎఫ్ఐఆర్ కాపీని సమర్పించాలని తమిళనాడు పోలీసులను కోరింది.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం కరూర్‌లో బెంగళూరు నుండి తమిళనాడులోని నాగర్‌కోయిల్‌కు వెళ్తున్న ప్రైవేట్ బస్సు ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.