/rtv/media/media_files/2025/10/03/madras-high-court-dismisses-tvk-party-petition-for-cbi-probe-2025-10-03-14-36-00.jpg)
Madras High Court dismisses TVK Party petition for CBI probe
ఇటీవల తమిళనాడులోని కురూర్‌లో టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన ప్రచారం ర్యాలీ(TVK chief Vijay rally) లో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనలో 41 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో కుట్ర ఉందని టీవీకే ఆరోపణలు చేసింది. తొక్కిసలాటపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ మద్రాస్ హైకోర్టు(madras-high-court) లో పిటిషన్ వేసింది. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. విజయ్ పార్టీపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరూర్ ఘటనపై పోలీసుల దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నట్లు పేర్కొంది.
Also Read: లద్దాఖ్ అల్లర్లలో ఇతనిదే కీలక పాత్ర.. కేంద్రం స్పెషల్ ఫోకస్!
Madras High Court Dismisses TVK Party Petition
ఇలాంటి సమయంలో సీబీఐ(cbi) విచారణను కోరడం సరైంది కాదని స్పష్టం చేసింది. కోర్టులను రాజకీయ ప్లాట్‌ఫామ్‌లుగా మార్చొద్దంటూ సూచించింది. అంతేకాదు తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తు జరపాలని బీజేపీ న్యాయవాది జీఎస్ మణి దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా రాజకీయ పార్టీలకు కూడా పలు సూచనలు చేసింది. '' ఇకనుంచి భవిష్యత్తులో నిర్వహించే బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించినప్పుడు అక్కడ తాగురు, పారిశుద్ధ్య సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. అలాగే అంబులెన్స్ సేవలు, నిష్క్రమణ మార్గాలు ఉండాలి. ప్రజల భద్రతకే ముందుగా ప్రాధాన్యం ఇవ్వాలని'' హైకోర్టు సూచించింది. మరోవైపు ప్రామాణిక నిర్వహణ విధాన నిబంధనలు (SOP) రూపొందించే వరకు రహదారులపై ఏ రాజకీయ పార్టీ సభలకు పోలీసులు పర్మిషన్ ఇవ్వరని తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు చెప్పింది.
#BREAKING | Madras High Court dismisses CBI probe plea in Karur stampede case@DharanVija47684 shares more details pic.twitter.com/4PnWpfeKUk
— NDTV (@ndtv) October 3, 2025
Also Read: రెయ్ దుర్మార్గుల్లారా.. రావణుడికి జై కొడుతూ..రాముడికి నిప్పంటించారు
ఇదిలాఉండగా ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ టీవీకే నామక్కల్ జిల్లా సెక్రటరీ సతీష్ కుమార్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు ఈ పటిషన్‌ను కూడా కొట్టివేసింది. ర్యాలీ సమయంలో జన సమూహాన్ని నియంత్రించడంలో పార్టీ ఎందుకు ఫెయిల్ అయ్యిందని జడ్జి ప్రశ్నించారు. అంతేకాదు తొక్కిసలాట బాధితులకు అదనపు పరిహారం ఇవ్వాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలుకాగా.. దీనిపై స్పందించాలని కోరుతూ కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.