Extra Marital Affairs : అక్రమసంబంధాల్లో కాంచీపురం టాప్ ..హైదరాబాద్ ఎన్నో ప్లేస్ అంటే?

తాజాగా ప్రముఖ డేటింగ్ యాప్ ఆష్లే మాడిసన్ జూన్ 2025 డేటాను రిలీజ్ చేసింది.  ఎక్స్ ట్రా - మారిటల్ అఫైర్స్ కోసం తమ యాప్ ను వాడే వారిలో  తమిళనాడులోని కాంచీపురం టాప్ లో ఉందని తెలిపింది.  

New Update
app

దేశంలో వివాహేతర సంబంధాలు పెరుగుతూ ఉండటం ఆందోళనకు గురిచేస్తుంది. ఈ వివాహేతర సంబంధాలు హత్యలకు దారి తీస్తున్నాయి.  ప్రియుడితో భార్య కట్టుకున్న భర్తను చంపడం,  లేదంటే ప్రియురాలు కోసం భర్త భార్యను చంపడం లాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ డేటింగ్ యాప్ ఆష్లే మాడిసన్ జూన్ 2025 డేటాను రిలీజ్ చేసింది.  ఎక్స్ ట్రా - మారిటల్ అఫైర్స్ కోసం తమ యాప్ ను వాడే వారిలో  తమిళనాడులోని కాంచీపురం టాప్ లో ఉందని తెలిపింది.  

ఢిల్లీ రెండవ స్థానంలో

గతేడాది ఈ ప్రాంతం 17వ స్థానంలో ఉండగా ఇప్పుడు టాప్ కు చేరుకుంది.  కాంచీపురం అగ్రస్థానంలో ఉండగా, ఢిల్లీ రెండవ స్థానంలో, గుర్గావ్ స్థానంలో నిలిచింది. ఆసక్తికరంగా ముంబై టాప్ 20లో కూడా చోటు దక్కించుకోలేదు. గతేడాది ముంబై టాప్ 2లో ఉంది. హైదరాబాద్  17 వ స్థానంలో నిలిచింది. కాగా ఆష్లే మాడిసన్ అనేది వివాహమైన వ్యక్తులు (లేదా భాగస్వామ్యంలో ఉన్నవారు) వివాహేతర సంబంధాల కోసం వెతుకుతున్న వారిని లక్ష్యంగా చేసుకున్న ఒక అంతర్జాతీయ డేటింగ్ ప్లాట్‌ఫారమ్. కెనడాకు చెందిన ఈ ఆన్‌లైన్ డేటింగ్ వెబ్‌సైట్ 2002లో ప్రారంభించబడింది. 

ఆష్లే మాడిసన్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ పాల్ కీబుల్ మాట్లాడుతూ, భారతదేశంలో ఆధునిక సంబంధాల నిర్వచనంలో గణనీయమైన మార్పు కనిపిస్తోందని, సర్వే చేసిన పెద్దలలో సగానికి పైగా వివాహేతర సంబంధాలను అంగీకరిస్తున్నారని తెలిపారు. ప్రపంచ మార్కెట్లలో భారతదేశం ఇప్పటికే ఆష్లే మాడిసన్ వినియోగంలో ఆరవ స్థానంలో ఉందని, ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisment
తాజా కథనాలు