/rtv/media/media_files/2025/10/03/lord-rama-2025-10-03-12-50-38.jpg)
చెడుపై మంచి విజయానికి ప్రతీకగా దసరా పండుగ(Dasara 2025)ను జరుపుకుంటారు. రావణుడు(ravanasura), కుంభకర్ణుడు, మేఘనాధుడి దిష్టిబొమ్మలను ఈ పండగ వేళ దహనం చేస్తారు. అయితే తమిళనాడు(tamil-nadu) లో తిరుచిరాపల్లిలో శ్రీరాముడి(lord-rama) దిష్టిబొమ్మను దహనం చేస్తూ, రావణుడికి అనుకూలంగా నినాదాలు చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫిఫ్త్ తమిళ్ సంగం అనే సంస్థ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో త్వరగా వైరల్ అయింది. ఇందులో కొందరు వ్యక్తులు శ్రీరాముడి దిష్టిబొమ్మకు నిప్పంటించి, రావణుడికి జై అంటూ నినాదాలు చేయడం కనిపిస్తుంది.
దిష్టిబొమ్మ దహనం తర్వాత, ఆ వీడియోలో వీణను మోస్తున్న పది తలల రావణుడి గ్రాఫిక్ రాముడి స్థానంలో కనిపించింది. ఈ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు స్పందించారు. వారు భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్లు 192, 196 (1)(a), 197, 299, 302, 353 (2) కింద కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం36 ఏళ్ల అడైకలరాజ్‌ను అధికారులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో పాల్గొన్న ఇతర వ్యక్తుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. బాధ్యులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Also Read : 10 పాక్ యుద్ధ విమానాలు ధ్వంసం చేశాం.. ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మార్షల్ సంచలన వ్యాఖ్యలు
Also Read : 35ఏళ్ల మహిళతో 75 ఏళ్ల వృద్ధుడి పెళ్లి.. తెల్లారే ఏం జరిగిందంటే?
విజయదశమి ఉత్సవాలు ఘనంగా
ఇక దేశ వ్యాప్తంగా విజయదశమి(Vijayadasami 2025) ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దసరా పండగ వేళ కీలక ఘట్టమైన రావణ దహన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. రామ్‌లీలా మైదానంలో జరిగిన దసరా వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె రామబాణం ఎక్కుపెట్టగా.. రావణ దహనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కావాల్సి ఉండగా.. వర్షం కారణంగా ఆయన కార్యక్రమం రద్దు చేయబడింది. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జరిగిన దసరా ఉత్సవాల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఉదయపూర్‌లోని స్పోర్ట్స్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు.