BIG BREAKING : సీఎం స్టాలిన్, త్రిష ఇంటికి బాంబు బెదిరింపు

చెన్నైలో తీవ్ర గందరగోళం మొదలైంది. సీఎం ఎంకే స్టాలిన్ నివాసం, నటి త్రిష ఇల్లు, తమిళనాడు గవర్నర్ బంగ్లా, బీజేపీ ఆఫీసులను లక్ష్యంగా చేసుకుని ఒకేసారి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి.

New Update
stalin trisha

చెన్నైలో తీవ్ర గందరగోళం మొదలైంది. సీఎం ఎంకే స్టాలిన్ నివాసం, నటి త్రిష ఇల్లు, తమిళనాడు గవర్నర్ బంగ్లా, బీజేపీ ఆఫీసులను లక్ష్యంగా చేసుకుని ఒకేసారి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నైలోని తేనాంపేట ప్రాంతంలోని త్రిష నివాసానికి బాంబు బెదిరింపు సమాచారం అందడంతో, పోలీసులు స్నిఫర్ డాగ్‌లతో సోదాలు నిర్వహించారు. కాగా ఆగస్టు 15న జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముందు స్టాలిన్‌ నివాసానికి కూడా బాంబు బెదిరింపు వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి గణేష్ గా గుర్తించిన పోలీసులు అతన్ని పట్టుకునే పనిలో పడ్డారు. 

భద్రతా బలగాలు అప్రమత్తం

బెదిరింపు సమాచారం అందిన వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDDS), డాగ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి పైన పేర్కొన్న అన్ని ప్రాంతాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాయి. తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో ఈ బెదిరింపులన్నీ వదంతులే (Hoax Threats) అని పోలీసులు నిర్ధారించారు. పోలీసులు ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకుని కేసు నమోదు చేశారు. గతంలో (జూలై 2025లో) కూడా సీఎం స్టాలిన్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది, అది కూడా ఆకతాయిల పనిగా తేలింది. ఈ వరుస బెదిరింపుల వెనుక ఆకతాయిల ప్రయత్నమా, లేక మరేదైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికి బెదిరింపులన్నీ వదంతులే అని తేలడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు, అయినప్పటికీ కీలక వ్యక్తుల నివాసాల వద్ద భద్రతను మరింత బలోపేతం చేశారు.

Advertisment
తాజా కథనాలు