SI Murder : తండ్రికొడుకుల గొడవను ఆపేందుకు వెళ్లిన ఎస్సైని దారుణంగా నరికి చంపారు!

తండ్రికొడుకుల మధ్య జరిగిన  గొడవను అపేందుకు వెళ్లిన ఓ ఎస్సైను దారుణంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  తిరుప్పూర్‌ జిల్లా కుడిమంగళం సిక్కనూత్తు ప్రాంతంలో మడత్తుకుళం అన్నాడీఎంకే ఎమ్మెల్యే మహేంద్రన్‌కు సొంత తోట ఉంది.

New Update
si murder

తమిళనాడులో దారుణం జరిగింది. తండ్రికొడుకుల మధ్య జరిగిన  గొడవను అపేందుకు వెళ్లిన ఓ ఎస్సైను దారుణంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  తిరుప్పూర్‌ జిల్లా కుడిమంగళం సిక్కనూత్తు ప్రాంతంలో మడత్తుకుళం అన్నాడీఎంకే ఎమ్మెల్యే మహేంద్రన్‌కు సొంత తోట ఉంది. అయితే అందులో మూర్తి, ఆయన కొడుకు తంగపాండి పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. అయితే ఇద్దరి మధ్య రాత్రి మద్యం తాగాక తీవ్రంగా గొడవపడ్డారు. తంగపాండి తన తండ్రిని కొట్టాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Also Read :  KA Paul : బుద్దుండాలి.. విజయ్ దేవరకొండపై కేఏ పాల్ ఫైర్!

వెంటనే కుడిమంగళం పోలీస్‌స్టేషన్‌  ఎస్సై షణ్ముగవేల్‌(57), ఓ కానిస్టేబుల్‌ రాత్రి 11 గంటల ప్రాంతంలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరి మధ్య గొడవను ఆపిన షణ్ముగవేల్‌.. తండ్రికొడుకుల ఫొటోలు తీసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ సమయంలో అక్కడికొచ్చిన మూర్తి మరో కుమారుడు మణికంఠన్‌ కత్తితో షణ్ముగవేల్, కానిస్టేబుల్‌ను నరికేశాడు. ఈ ఘటనలో  షణ్ముగవేల్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కానిస్టేబుల్‌ను వెంటనే స్థానికంగా ఓ ఆసుపత్రిలో చేర్పించగా అక్కడ చికిత్స అందిస్తున్నారు. పోలీసులు మూర్తి, మణికంఠన్‌ను అరెస్టు చేయగా, తంగపాండి కోసం గాలిస్తున్నారు.  ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.   అధికారుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుని షణ్ముగవేల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. షణ్ముగవేల్‌ మృతికి ఆయన కుటుంబ సభ్యులు, పోలీసులు సంతాపం వ్యక్తం చేశారు.

Also Read :  US Woman Coma: అవయవాలు దానం చేస్తుండగా.. చివరి క్షణంలో కోమాలోంచి బయటకొచ్చింది

పరిహారం ప్రకటించిన సీఎం స్టాలిన్

ఈ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి  వ్యక్తం చేశారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. మరణించిన పోలీసు అధికారి కుటుంబానికి రూ.కోటి పరిహారం ప్రకటించారు.  ఈ హత్య తమిళనాడు పోలీసులకు, అధికారి కుటుంబానికి తీరని లోటని ఆయన అభివర్ణించారు. "ఈ విషాద సంఘటన గురించి విని నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. షణ్ముగవేల్ మరణం తమిళనాడు పోలీసు శాఖకు, అతని కుటుంబానికి తీరని లోటు.నిందితులను త్వరగా పట్టుకోవాలని నేను పోలీసులను ఆదేశించానని ఆయన అన్నారు.

Also read :  Cloud Burst: అది క్లౌడ్ బరస్ట్ కాదేమో..ఉత్తరాఖండ్ లో వరదలపై శాస్త్రవేత్తల అనుమానం

Advertisment
తాజా కథనాలు